మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జూన్ 9 : జి ల్లా కేంద్రంలోని దుకాణంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం చోటు చేసుకున్నది. ఫైర్ ఆఫీసర్ పద్మయ్య కథనం మేరకు.. జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ సమీపంలో ఉన్న సునీ తా బెడ్వర్క్ దుకాణాన్ని బుధవారం రాత్రి బంద్‌చేసి యజమాని వెంకటస్వామి వెళ్లాడు. అయితే గురువారం ఉదయం దుకాణంలో షా ర్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. దీంతో దుకాణం మొత్తం పొగ కమ్ముకున్నది.
దీంతో దుకాణంలోని బెడ్వర్క్, వస్తువులు దగ్ధమయ్యాయి. స్థానికులు అప్రమత్తమై మంటలు ఆర్పేందుకు యత్నించారు. తగ్గకపోవడంతో అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి సుధాకర్, సిబ్బంది మురళీధర్‌రెడ్డి, వీరేశ్‌తో కలిసి ఫైర్ ఇంజన్‌తో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో రూ.10 లక్షల నష్టం వాటిల్లినట్లు యజమాని తెలిపాడు. అయితే దుకాణం సమీపంలోనే సిలిండర్ల గోదాం ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది.