నాగర్‌కర్నూల్, జూన్ 9 : గ్రామాలను బాగుపర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె ప్ర గతి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నదని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని అవురాసిపల్లి గ్రామంలో 5వ విడుత ప ల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గ్రా మంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బొడ్రాయి వద్ద కొబ్బరికాయ కొట్టారు. గ్రా మ దేవతను దర్శించుకొని పూజలు నిర్వహించారు. ప్ర తి ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచితేనే గ్రామం సై తం పరిశుభ్రంగా ఉంటుందన్నారు. గ్రామంలో ఎమ్మె ల్యే మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతివీధి పరిశుభ్రం గా ఉంచుకోవాలని, ప్రభుత్వ సూచన మేరకు అన్ని అభివృద్ధి పనులు చేసుకోవాలని సూచించారు.
అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మెరుగైన వై ద్యం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎం తో తోడ్పాటును అందిస్తుందని ఎమ్మెల్యే మర్రి అన్నా రు. గురువారం నియోజకవర్గంలోని ఐదు మండలాల కు చెందిన 123 మంది బాధితులకు సీఎంఆర్ఎఫ్ చె క్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ లక్షలాది మంది పేదలకు సహాయనిధి అందజే స్తూ అండగా నిలిచారని తెలిపారు. కార్యక్రమాల్లో ము న్సిపల్ చైర్పర్సన్ కల్పన, వైస్ చైర్మన్ బాబురావు, ఎంపీడీవో కోటేశ్వర్రావు, జెడ్పీటీసీ శ్రీశైలం, ఎంపీపీ నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఈశ్వర్‌రెడ్డి, కేశవులుగౌడ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.