కొల్లాపూర్, జూన్ 9 : రాష్ట్రంలోని పల్లెల్లో క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులు తర్ఫీదు పొందేందుకు ఈ క్రీడా ప్రాంగణాలు ఎంతో ఉపయోగపడుతాయని చెప్పారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వారికి అనుకూల క్రీడల్లో సాధన చేసి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి ఈ ప్రాం తానికి పేరు తీసుకురావాలని కాంక్షించారు. గురువారం మండలంలోని నార్లాపూర్ గ్రామంలోని రైతువేదిక సమీపంలో రూ.4 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కొద్దిసేపు స్థానిక క్రీడాకారులతో కలిసి ఎ మ్మెల్యే వాలీబాల్ ఆడారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడా రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పారు. అనంతరం హరితహారం మొక్కలను మార్కెట్ కమిటీ చై ర్మన్ కిషన్‌నాయక్, ఎంపీపీ భోజ్యానాయక్, ఎంపీటీసీ పాండునాయక్, సర్పంచులు చిట్టెమ్మ వెంకటయ్య, శంకర్ నాయక్‌తో కలిసి ఎమ్మెల్యే నాటి నీళ్లు పోశారు. అనంత రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పది, పన్నెండేండ్లుగా నార్లాపూర్ పెద్దగట్టు వద్ద చిన్నవాగుపై నిలిచిపోయిన వంతెన పనులు తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ప్రారంభించినట్లు తెలిపారు.
ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి వంతెన పనులు చేపట్టామన్నారు. ఈ పనులు పూర్తయితే కొల్లాపూర్-అచ్చంపేట మధ్య బస్సులు తిరిగేందుకు వీలుంటుందని ఎమ్మెల్యే బీరం పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనువాసులు, సూపరింటెండెంట్ మనోహర్, ఏపీవో నాగరాజు, టీఏ బాబు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, పెద్దకొత్తపల్లి జెడ్పీటీసీ గౌరమ్మ, పంచాయతీ కార్యదర్శులు ప్రేమ్‌చంద్, ఈశ్వర్, మాజీ ఎంపీటీసీ నిరంజన్ నాయక్ తదితరులున్నారు.