మహబూబ్నగర్టౌన్, మే 30: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి జూన్ 18వరకు ఓపెన్ ఇంటర్, పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 11:30 గంటలవరకు నిర్వహించనున్న పరీక్షలకు సంబంధించి శుక్రవారం మహబూబ్నగర్, జడ్చర్ల, స్ట్రాంగ్ పాయింట్ల నుంచి పరీక్షా ప్రశ్నాపత్రాలను వివిధ పరీక్ష కేంద్రాలకు తరలించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇంటర్, పదో తరగతి కలిసి 34పరీక్షా కేంద్రాల్లో 6,101 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ మేరకు కేంద్రాల్లో వసతుల కల్పనపై దృష్టి సారించారు.
వచ్చే నెల 21నుంచి 26వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో ఇంటర్ 5, పదో తరగతి 5 సెంటర్లు ఏర్పాటు 1538 మంది, జోగుళాంబగద్వాల పదో తరగతి 2, ఇంటర్ 2 సెంటర్లలో 1298 మంది, వనపర్తిలో పదో తరగతి 2, ఇంటర్ 2 సెంటర్లలో 839, నాగర్కర్నూల్లో పదో తరగతి 4, ఇంటర్ 4 సెంటర్లలో 1095 మంది, నారాయణపేటలో పదో తరగతి 3, ఇంటర్ 3 సెంటర్లలలో 1,331 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఓపెన్ ఇంటర్, పదోతరగతి పరీక్షల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మహబూబ్నగర్ డీఈవో ఉషారాణి తెలిపారు.