వానకాలం సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. దుక్కి దున్ని నాటు వేసేందుకు శ్రీకారం చుట్టనున్నారు. వనపర్తి జిల్లాలో నీటి వనరుల లభ్యత మరింత పెరిగింది. గతేడాదితో పోలిస్తే దాదాపు 10వేల ఎకరాలు అదనంగా సాగులోకి రానున్నదని వ్యవసాయశాఖ అంచనా వేసింది. సాగు అంచనాకు తగ్గట్లుగా విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసింది. నకిలీ విత్తనాలపై సర్కార్ నిఘా పెంచింది. అక్రమార్కుల గుట్టు రట్టు చేస్తూ ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేస్తున్నది. జూలై 15నాటికి పంటల ప్రణాళికను పూర్తిచేయాలని వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాలకు సంబంధించిన వానకాలం సన్నాహక సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితోపాటు వ్యవసాయ నిపుణులు రైతులకు సూచించారు.
వనపర్తి, మే 30 (నమస్తే తెలంగాణ) : వానకాలం సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పొడి దు క్కులు దున్నుతున్నప్పటికీ వర్షాలు పడిన వెంటనే పూర్తిస్థాయిలో రంగంలోకి దిగి పంటలు పండించేందుకు శ్రీ కారం చుట్టనున్నారు. వనపర్తి జిల్లా పంటలకు సంబంధించి వ్యవసాయాధికారులు, ఉద్యానవనశాఖ అధికారులు అంచనాకు వచ్చారు. ఇక్కడి నేల స్వభావం రీ త్యా.. నీటి అధిక లభ్యత వల్ల రైతులు వానకాలంలో వరి పంటకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
అనంతరం కంది, మొక్కజొన్న పంటలు పండించడానికి సిద్ధమవుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి దాదాపు 10 వేల ఎకరాలు అదనంగా సాగులోకి రానున్నదని వ్యవసాయ శాఖ అంచనా. దానికి తగ్గట్లుగా విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసింది. రైతుబంధు డబ్బులను ఖాతా ల్లో వేయగానే వ్యవసాయ పనులను ముమ్మరం చేయనున్నారు.
దీనికి సంబంధించి పంటలను జూలై 15 నా టికి పూర్తిచేయాలని వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగుళాంబగద్వాలకు సంబంధించిన వానకాలం సన్నాహక స మావేశంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితోపాటు వ్యవసాయ నిపుణులు రైతులకు సూచించారు. నకిలీ విత్తనాలపై ప్రభుత్వం నిఘా ఏర్పాటు చేసింది. అయితే సాగునీరుకు ఢోకా లేకపోవడంతో చాలా మం ది తమకు నచ్చిన సమయంలో నాట్లు వేస్తున్నారు. 24 గంటల ఉచిత కరెంట్ ఉండడం వల్ల బోరుబావులు, పంపుసెట్ల కింద ఉన్న భూముల్లో పంటలను ముందుగానే వేసుకుంటున్నారు.
ప్రస్తుత వానకాలం సీజన్లో 2,59,830 ఎకరాల్లో సాగు అవుతుందని వ్యవసాయశాఖ అంచనా. గత వా నకాలంతో పోలిస్తే ఈ దఫా 10వేల ఎకరాలకుపైగా అదనంగా సాగులోకి వస్తుందని భావిస్తున్నారు. గతేడా ది 2,49,134 ఎకరాలు సాగు చేయగా ప్రస్తుత వానకాలం సీజన్లో 2,59,830 ఎకరాలు సాగులోకి వ స్తుందని చూస్తున్నారు. ఇందులో వరి 1,85,585 ఎకరాలు, కంది 19,918, మొక్కజొన్న 11,631, జొన్న 2642, పత్తి 17,421, రాగి 78, వేరుశనగ 2,299, ఆముదం 2588, ఇతర పంటలు 17,919 ఎకరాల్లో పండించనున్నారు. అన్ని జిల్లాల్లో వరి తర్వాత పత్తికి అధిక ప్రాధాన్యం ఇస్తే.. ఇక్కడి రైతులు వరి తర్వాత కంది పంటను ఎక్కువ సాగుచేస్తున్నారు.
పంటసాగు విస్తీర్ణం పెరుగుతుందని అంచనా వేసి దానికి తగ్గట్టుగా వ్యవసాయశాఖ విత్తనాలను సిద్ధం చేసింది. వరి 46,400, కందులు 800, వేరుశనగ 2090, మొక్కజొన్న 950 క్వింటాళ్లు, జొన్నలు 110, ఆముదాలు 55, పత్తి 35 వేల బ్యాగులు, మినుములు, పెసర్లు, పచ్చిరొట్ట వంటి విత్తనాలను సిద్ధం చేసింది.
అంచనాకు తగ్గట్లుగా ఎరువులను కూడా సిద్ధం చేశా రు. యూరియా 25,816 బస్తాలు, డీఏపీ 5025, ఎం వీపీ 2008 బస్తాలు, కాంప్లెక్స్ 12,908, ఎస్ఎస్పీ 4, 824 బస్తాలు సాగుకు ఎరువులు అవసరమవుతాయి.
సాగుకు అవరసర మయ్యే విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచాం. రైతుబంధు పథకం ద్వారా రైతుల ఖాతాల్లో త్వరలో జమ కానున్నాయి. జిల్లాలో పెరిగిన సాగునీటి వనరుల వల్ల సాగు విస్తీర్ణం దాదాపు 10వేల ఎకరాల్లో అదనంగా పెరగనున్నది. కల్తీ ఎరువులు, విత్తనాలపై జాగ్రత్తలు తీసుకోవాలి. దుకాణాల నుంచి రసీదులు తప్పక తీసుకోవాలి.
– సుధాకర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి, వనపర్తి