బాలానగర్, మే 30 : గ్రామాల అభివృద్ధే టీఆర్ఎస్ సర్కార్ ధ్యేయమని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని మొదంపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు, పెద్దాయపల్లి సమీపంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద సీసీ ప్లాట్‌ఫాం నిర్మాణ పనులకు శంకుస్థాపన చే శారు. అలాగే గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు.
బాలానగర్, రాజాపూర్ మండలాల్లో ఇటీవల విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురికి విద్యుత్ శాఖ నుంచి మంజూరైన రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కులను బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో టీజీసీసీ చైర్మన్ వాల్యానాయక్, డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్‌రెడ్డి, గిరిజన రాష్ట్ర నాయకు డు లక్ష్మణ్‌నాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాసరావు, వర్కింగ్ మండలాధ్యక్షుడు బాలునాయక్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, సింగిల్ విం డో డైరెక్టర్ మంజూనాయక్, ఎంపీటీసీ లిం గూనాయక్, సర్పంచులు శంకర్, ఖలీల్, ర మేశ్, ఏఎంసీ డైరెక్టర్లు మల్లేశ్, శివానందరె డ్డి, కో ఆప్షన్ జమీర్‌పాషా, నాయకులు నాగేందర్‌నాయక్, సూరి, బాలయ్య, శ్రీకాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.
నవాబ్‌పేట, మే 30 : మండలంలోని గో వోనిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న హనుమాన్ ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సోమవారం భూమి పూజ చేసి ప నులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ హయాం లో అన్ని వర్గాల వారు సంతోషంగా జీవిస్తున్నారన్నారు. గోవోనిపల్లిలో ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ అనంత య్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మ న్ లక్ష్మయ్య, ముడా డైరెక్టర్ చెన్నయ్య, రైతు బంధు సమితి మండల కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి, సర్పంచులు గోపాల్‌గౌడ్, యాద య్య యాదవ్, ఎంపీటీసీ రాధాకృష్ణ, మాజీ ఎంపీపీ శీనయ్య, నాయకులు నాగిరెడ్డి, అ బ్దుల్లా, నవనీతరావు, శ్రీను, భోజయ్యచా రి, రాములు, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.