మహబూబ్‌నగర్, మే 30 : మన పల్లెలు, పట్టణా లు మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా పాదయాత్రలు చేసి పనులను గుర్తించాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని తన క్యాం పు కార్యాలయం నుంచి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 3 నుంచి పల్లె, పట్టణ ప్రగతి ప్రారంభంకానున్నందున ఎంపీ, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లా ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్పర్సన్లు, కలెక్టర్లు, మున్సిపల్ చైర్మన్లు, మండల, గ్రామ, ప్రజాప్రతినిధులు, అధికారులతో మాట్లాడారు.
రాష్ట్ర అవతరణ తరువాత చేపట్టిన కా ర్యక్రమాల గురించి ప్రజలకు తెలిసేలా గ్రామ పంచాయతీలు, వార్డుల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని సూ చించారు. ప్రతి గ్రామంలో పాదయాత్రలు చేయాలన్నారు. క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని, ప్రగ తి పనులు నిరంతరం కొనసాగేలా చూడాలన్నారు. వానకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. గడిచిన 70 ఏండ్లల్లో వచ్చిన నిధులు, వాటి వివరాలపై బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
మున్సిపాలిటీలు, జంక్షన్ల అ భివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. మిషన్ భగీరథ నీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి స మస్యనూ పరిష్కరించాలన్నారు. వీసీలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్లు స్వర్ణసుధాకర్‌రెడ్డి, వనజ, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి, కలెక్టర్లు వెంకట్రావు, హరిచందన, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు, స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, అధికారులు పాల్గొన్నారు.
కరోనా కాటుకు బలై తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. పీఎం కేర్ ద్వారా మంజూరై న చెక్కులు, హెల్త్ కార్డులను కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో బాధితులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అందజేశారు. విద్యార్థులకు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు ఉన్నారు.
బస్టాండ్ వద్ద కూడలిలో ఉన్న బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇతర ప్రాంతానికి తరలించొద్దని మంత్రికి మాలమహానాడు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ప్రజల నిర్ణయం మేరకే అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. వినతి ఇచ్చిన వా రిలో ఆ సంఘం అధికార ప్రతినిధి వెంకటస్వామి, ఫూ లే, అంబేద్కర్ జాతర కమిటీ జిల్లా అధ్యక్షుడు నర్సింహులు, శ్రీరాములు, శేఖర్, మన్యం, చిన్న ఉన్నారు.