మక్తల్ టౌన్, మే 30 : బాల్య వివాహాలను ప్రోత్సహించరాదని, మహిళా నాయకురాళ్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల ని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. పట్టణంలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో జిల్లా మహిళాభివృద్ధి, శిశు సం క్షేమ శాఖ అభివృద్ధి సహకారంతో ఎమ్మెల్యే చిట్టెం ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పిల్లల పోష క విలువలకు సంబంధించి పోషకాల ప్రదర్శనను ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే చిట్టెం ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు తొందర పడి పెండ్లిళ్లు చేయవద్దని పేర్కొన్నా రు. పెండ్లిళ్లు చేయడం వల్ల మానసికం, శారీరకం, సామాజికం, ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకం ప్ర వేశపెట్టి ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసా కల్పించిందన్నారు. గ్రామ స్థాయి లో ప్రజాప్రతినిధులు, సర్పంచులు, అంగన్వాడీ టీచర్లు, యువకులు బాల్య వివాహాలు జరుగకుండా చూసుకోవాలన్నారు. బాలల చట్టాలపై ప్రజాప్రతినిధులకు పూర్తిగా అవగాహన ఉండాలన్నారు.
జిల్లా వెల్ఫేర్ ఆధ్వర్యంలో భార్యాభర్తలకు పిల్లల విష యంలో అవగాహన కల్పించేందుకు సబ్సెంటర్ను సంప్రదించాలన్నారు. తెలంగాణ బచ్పన్ బచావో కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బాలల చట్టాలపై అవగాహన కల్పిస్తూ చట్టాలు ఎలా ఉన్నాయని ప్రజాప్రతినిధులు చే యాల్సిన పాత్రను వివరించామన్నారు. పిల్లల దత్తతను చ ట్టపరంగా ప్రోత్సహించాలన్నారు. గ్రామాల్లో ఎక్కడైనా పిల్లలను పోషించలేని స్థితిలో తల్లిదండ్రులు ఉన్న, పిల్లలను హింసిస్తున్న పిల్లలను గుర్తించి జిల్లా వెల్ఫేర్ ఆపీస్కు సమాచారమివ్వాలన్నారు.
అనంతరం బచ్పన్ బచావో పోస్టర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వెల్ఫేర్ అధికారి వేణుగోపాల్, సీడీపీవో సరోజిని, ఎంపీపీ వనజ, సీఐ సీతయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్రె డ్డి, ఎంపీడీవో శ్రీధర్, ఎస్సై రాములు, సూపర్వైజర్లు, అం గన్వాడీ టీచర్లు, నియోజకవర్గంలోని ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, అన్ని మండలాల ఎస్సైలు, నాయకు లు తదితరులు పాల్గొన్నారు.