ఊట్కూర్, మే 30 : మండలకేంద్రంలోని శబరి పీఠం అయ్యప్పస్వామి ఆలయంలో సోమవారం సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప స్వామి, గణపతి విగ్రహ మూర్తులకు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతల స హకారంతో ప్రతినెలా అమావాస్య సందర్భంగా ఆలయం లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని సర్పంచ్ పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో అఖిల భారత అయ్య ప్ప సేవ సమితి సభ్యులు భగవంతు, శంకర్, భానుచందర్, వెంకట్రాములు, రఘువీర్, శ్రీనివాసులు, అభిలాశ్, అయ్యలప్ప పాల్గొన్నారు.
కృష్ణ, మే 30 : మండలంలోని గుడెబల్లూర్‌లో వె లిసిన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం లో అమావా స్య సందర్భంగా సోమవారం భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి పంచామృతాభిషేకం, ప్రత్యే క పూజలతోపాటు మహా మంగళహారతి, తీర్థప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరు లు పాల్గొన్నారు.
నారాయణపేట టౌన్, మే 30 : శనీశ్వరుడి జయంతి సందర్భంగా సోమవారం జిల్లాకేంద్రంలోని బారంబావి శ నీశ్వర ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారు జా ము నుంచే భక్తులు స్వామి వారి విగ్రహానికి తైలాభిషేకం, నల్లటి వస్ర్తాలు సమర్పించారు. అర్చకు లు విద్యాధర్ దీక్షిత్ మంత్రోచ్ఛారణల తో పూజలు చేయగా, భక్త బృందం భ క్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
నారాయణపేట రూరల్, మే 30 : జిల్లాకేంద్రం శివారులోని అయ్యప్పస్వామి ఆలయంలో సోమవారం అ మావాస్యను పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వా మి వారికి పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలతోపాటు మహా మంగళహారతి, భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేపట్టారు. పట్టణానికి చెందిన దేవమణి నారాయణరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టా రు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మనోహర్ప్రసాద్గౌడ్, సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.
దామరగిద్ద, మే 30 : మండలకేంద్రానికి సమీపంలో ఉన్న కర్ణాకట రాష్ట్రం మోతక్‌పల్లి బలభీమసేను ఆలయంలో నిర్వహించిన అన్నదాన కా ర్యక్రమానికి వైస్ ఎంపీపీ దామోదర్‌రెడ్డి హా జరయ్యారు. అంతకుముందు స్వామి వారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, అభిషే కాలు, భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేపట్టా రు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకు లు, భక్తులు పాల్గన్నారు.
మక్తల్ టౌన్, మే 30 : పేదలకు అన్నదా న కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని లయన్స్ క్లబ్ మక్తల్ అధ్యక్షుడు రమేశ్‌రావు అన్నారు. పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి ఆల య ఆవరణలో లయన్స్ కబ్ సభ్యుడు రతన్ అ నూష గుప్తా వివాహ వార్షికోత్సవం సందర్భం గా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం ఆం జనేయస్వామికి పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేశ్‌రావు మాట్లాడుతూ అమావాస్య సందర్భంగా భక్తులు, పేదలకు అన్నదానం చేయడం గొప్ప భాగ్యమని తెలిపారు. కార్యక్రమంలో కా ర్యదర్శి అశోక్, కోశాధికారి అంబాదాస్, శ్రీరా మ్, శ్రీనివాసులు, రవికుమార్, చంద్రకాంత్గౌ డ్, నరేందర్, వెంకటేశ్, కె.వెంకటయ్య, పృథ్వీరాజ్, లయన్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.