కొత్తకోట, మే 29 : జూన్ 4వ తేదీన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో భూత్పూర్లో జరిగే మంత్రి కేటీఆర్ బహిరంగసభను విజయవంతం చేయాలని జెడ్పీ వైస్‌చైర్మన్ వామన్‌గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని నిర్వేన్, పాలెం, రామనంతపురం గ్రామాల్లో సన్నాహక స మావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వామన్‌గౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృ ద్ధి పథంలో దూసుకుపోతున్నదన్నారు. కేసీఆర్ పథకాలు అందని ఇల్లు, వ్యక్తి లేడని, అందుకే జూన్ 4 నిర్వహించే మంత్రి కేటీఆర్ సభకు ప్రజలను అధికసంఖ్యలో మీ గ్రామాల నుంచి తరలించాలని కార్యకర్తల కు సూచించారు. ప్రతిగ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని, మహిళలను పెద్ద సంఖ్యలో తరలించి సభ విజయవంతానికి కృషి చేయాలని ఆయన కోరారు.
మంత్రి కేటీఆర్ బహిరంగసభకు కార్యకర్తలు అధికసంఖ్యలో తరలిరావాలని ఎంపీపీ గుంత మౌనిక కోరారు. ఆదివారం కనిమెట్ట గ్రామంలో ఎంపీపీ గుంతమౌనిక ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించి మాట్లాడారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మ న్ బాల్‌నారాయణ, మండల రైతు సంఘం అధ్యక్షుడు కొండారెడ్డి, మండల మహిళా సంఘం అధ్యక్షురాలు నిర్మలారెడ్డి, సర్పంచ్ రాధమ్మ, టీఆర్ఎస్ నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, మోహన్‌కుమార్, రామకృష్ణారెడ్డి, అ లీం, చాయ్దాబా రాజు, మైబు, రామకృష్ణ, రాములు, కౌన్సిలర్ రామ్మోహన్‌రెడ్డి, కోటేశ్వర్‌రెడ్డి, రాంచంద్రయ్యతోపాటు కార్యకర్త లు, ప్రజలు పాల్గొన్నారు.