పాన్‌గల్, మే 29 : ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన, సురక్షితమైన, శుద్ధిచేసిన తాగునీటిని నల్లాల ద్వారా సరఫరా చేయాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం ఫలించింది. గత ప్రభుత్వాల హయాంలో వేసవి వచ్చిందంటే చాలు తాగునీటికి నానా ఇబ్బందులు పడాల్సివచ్చేది. ప్రజల దాహార్తిని తీర్చేందుకు గ్రామగ్రామానా ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేసే పరిస్థితి ఉండేది. తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఇప్పుడా పరిస్థితి మచ్చుకూ కనిపించడం లేదు.
ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన, శుద్ధిచేసిన తాగునీటిని సరఫరా చేస్తూ, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామాల్లో ఒక్కొక్కరికీ రోజుకు 100 లీటర్ల నీటి సరఫరాను నిరాటంకంగా కొనసాగిస్తున్నది. ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి మిషన్‌భగీరథ పథకం ద్వారా పల్లెల్లో తాగునీటి కోసం బిందెలు పట్టుకొని రోడ్డుమీదకు వచ్చే పరిస్థితులు మారాయ ని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో మొత్తం 47,072 మంది జనాభా ఉంది.
ఆయా గ్రామాల తాగునీటి అవసరాల నిమిత్తం ప్రభుత్వం 39 ఏహెచ్ఆర్ ట్యాంకులు నిర్మించింది. ట్యాంక్‌ల ద్వారా మండలంలోని 39 గ్రామాల్లో 131కిలో మీటర్ల చొప్పున పైప్‌లైన్ చేపట్టాల్సి ఉండగా, 130 కిలోమీటర్ల వరకు పైప్‌లైన్ నిర్మాణాలు పూర్తి చేసుకొని ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందిస్తున్నారు. అదేవిధంగా ఇంటింటికీ 12,002 మిషన్ భగీరథ నల్లా కనక్ష న్లు పూర్తి అయ్యాయి. ప్రజల చెంతకే స్వచ్ఛమైన తాగునీరు అందించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ ఆయా గ్రామాల ప్రజలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
మా గ్రామంలో రెండు, మూడేండ్ల కిందటి వరకు తాగునీటికి ఇబ్బందులు పడ్డాం. కిలోమీటర్ల దూరం వెళ్లి తాగునీటిని వాహనాల ద్వారా తెచ్చుకొనేవాళ్లం. లేదంటే ట్రాక్టర్ల ద్వారా ప్రభు త్వం సరఫరా చేసే నీటిని తాగేవాళ్లం. ఇప్పుడు మిషన్ భగీరథ నీరు వస్తుండడంతో తాగునీటి సమస్య తొలగిపోయింది. రోజూ ఉదయం రెండు గంటలపాటు నీళ్లొస్తున్నాయి.
– చింతకాయల రాముడు, కేతేపల్లి, పాన్‌గల్ మండలం
మా గ్రామంలో సురక్షితమైన తాగునీటిని అందించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. కలుషితమైన తాగునీటి వల్లే స గం రోగాలు వస్తాయని గుర్తించిన సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ద్వారా సురక్షితమైన తాగునీటిని సర ఫరా చేస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో తాగునీటికి అరిగోసపడ్డాం. ఇప్పుడా పరిస్థితిలేదు. ఒక్కొక్కరికీ 100 లీటర్ల చొప్పున మిషన్‌భగీరథ నీటిని అందిస్తున్నారు.
– ఎం.శ్రీధర్‌రెడ్డి, ఎంపీపీ, పాన్‌గల్ మండలం
ప్రతి గ్రామంలో పైప్‌లైన్ పూర్తై దాదాపు వందశాతం ఇండ్లకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. ప్రధానంగా ఎండాకాలంలో ప్రజలకు నీటికొరత లేకుండా చూస్తున్నాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు లీకేజీలు సరి చేస్తున్నాం. ఏదైనా సమస్య మాదృష్టికి తీసుకొస్తే వీలైనంత త్వరలో పరిష్కారంచేసి నీటి సర ఫరాను నిర్విరామంగా కొనసాగిస్తున్నాం.
– నాగేశ్వర్‌రెడ్డి, ఎంపీడీవో, పాన్‌గల్ మండలం