మహబూబ్‌నగర్‌టౌన్, మే 29 : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని డీవైఎస్వో శ్రీనివాస్ సూచించారు. జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ గ్రామర్స్కూల్లో ఏర్పాటు చేసిన హ్యాండ్‌బాల్ శిక్షణాశిబిరంలో ఆదివారం విద్యార్థులకు క్రీడాపోటీలను ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీవైఎస్వో మాట్లాడుతూ వేసవిలో జిల్లావ్యాప్తంగా 17 శిక్షణాశిబిరాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు వివిధ క్రీడాంశాలపై సీనియర్ కోచ్‌లతో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
అదేవిధంగా శిక్షణాశిబిరాల్లో ప్రాక్టిస్ మ్యా చ్‌లు నిర్వహించి ప్రతిభగల క్రీడాకారులను గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించే క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని, వేసవి శిక్షణాశిబిరాలను సద్వినియోగం చేసుకొని క్రీడానైపుణ్యం పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో గ్రామర్‌స్కూల్ ప్రిన్సిపాల్ శాంత, హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి జియావుద్దీన్, అనిల్‌కుమార్, అహ్మద్‌హుస్సేన్, ప్రదీప్‌కుమార్, ప్రశాంతి, శివుడు తదితరులు పాల్గొన్నారు.