మక్తల్ రూరల్, మే 29 : ఈ-కేవైసీ పేరుతో మీ సేవ కేంద్రాల్లో రైతన్నలను దోపిడీ చేస్తున్నారు. పీఎం కిసాన్ స మ్మాన్ నిధి నుంచి పెట్టుబడి సాయం కోసం కేంద్ర ప్రభు త్వం ఈ-కేవైసీని రైతులు ఈనెల 31వ తేదీ లోగా నమోదు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మండల వ్యవసాయాధికారులు ఆయా గ్రామాల్లో విస్తృతంగా ప్రచా రం చేశారు. అదేవిధంగా రైతు వేదికల్లో అధికారులు రైతన్న లకు అవగాహన కల్పించి ఈ-కేవైసీని తప్పనిసరిగా నమో దు చేసుకోవాలని సూచించారు. ఈ-కేవైసీ చేయించుకోని రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం నుంచి అందిం చే పెట్టుబడి నగదు రైతుల ఖాతాల్లో జమ కాదన్నారు.
దీం తో రైతులు ఈ-కేవైసీ బ్యాంక్ ఖాతాలకు ఆధార్ కార్డు లిం క్ అనుసంధానం చేసుకోవడానికి మీ సేవ కేంద్రాలకు ప రుగులు పెట్టారు. ఇదే అదునుగా భావించిన మీ సేవ కేం ద్రాల యజమానులు నిబంధనలకు విరుద్ధ్దంగా అదనపు చార్జీలను వసూలు చేసి నిలువు దోపిడీ చేస్తున్నారని పలు వురు రైతులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో మక్తల్ పట్ట ణంలోని ఆయా మీ సేవ కేంద్రాల్లో ఉదయం నుంచే రైతు లు పడిగాపులు పడుతున్నారు. మండలంలోని ఆయా గ్రా మాలకు చెందిన రైతులు పట్టణానికి వచ్చి మీ సేవ కేంద్రా ల్లో అప్డేట్ చేసుకోవాల్సి ఉంది.
దీనిని ఆసరాగా చేసుకొని కొందరు మీ సేవ కేంద్రాల్లో పని చేస్తున్న ఆపరేటర్లు ఇష్టం వచ్చినట్లు డబ్బులను వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బ్యాంక్ ఖాతాలకు ఆధార్ కార్డు నెంబర్లు అనుసంధానం చేయడానికి రూ.30 తీసుకోవాల్సి ఉంది. అయితే రూ.50 నుంచి రూ. 60 వరకు వసూలు చేస్తున్నారు. ఈ-కేవైసీకి ఆధార్ కార్డులను అనుసంధానం చేయడానికి రూ.150 తీసుకుంటుంన్నారని పలువురు రైతులు ఆదివారం “నమస్తే తెలంగాణా ”కు తెలిపారు. ఒక వేళ ఇది వరకు బ్యాంక్ ఖాతాలకు ఆధా ర్ కార్డు అనుసంధానం చేసి ఉంటే ఈ-కేవైసీకి రూ.100 వసూలు చేస్తున్నారు. దీంతో పట్టణంలోని ఆయా మీ సేవ కేంద్రాల యజమానులు పెద్దఎత్తున డబ్బులు దండుకోవడంతో బాధితులు ఇదేమి దోపిడీ? అని ప్రశ్నిస్తున్నారు.
కా గా చాలా రోజులుగా పట్టణంలోని మీ సేవ కేంద్రాల్లో పెద్ద ఎత్తున దోపిడీలు కొనసాగుతున్న సంబంధిత అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపించా రు. ఇది వరకు పీఎం కిసాన్ డబ్బుల కోసం ఆధార్ కార్డులను బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేసుకొని ఉంటేనే డబ్బులు ఖాతాల్లో జమ అవుతాయని అధికారులు తెలిపా రు. రోజుకో నింబంధనలను మార్చుతూ రైతులను ఎందు కు ఇబ్బందులు పెడుతున్నారని వాపోతున్నారు.
వారం రో జులుగా ఈ-కేవైసీ కోసం మీ సేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గ్రామాల నుంచి రైతులు ఉదయం 6-7 గంటలకే మీ సేవ కేంద్రాలకు చేరుకొని గుమిగూడితున్నారు. జనం రద్దీతో మీ సేవ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ఈనెల 31 వరకు మాత్రమే గడువు పెట్టడంతో మరింత ఇబ్బందులు పడుతున్నారు. కాగా మీ సేవ కేం ద్రా ల్లో నిబంధనల ప్రకారం డబ్బులు తీసుకోవాలని, అదనంగా వసూలు చేస్తున్న అక్రమార్కులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు.