నాగర్‌కర్నూల్ జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రెండు, మూడు నెలల్లో మెడికల్ కళాశాల తరగతులు ప్రారంభం కానున్నాయి. జాతీయ మెడికల్ కమిషన్ నుంచి అనుమతులు వచ్చాయి. 150 మంది విద్యార్థులతో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 61 మంది ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేశారు. ఇక తరగతుల నిర్వహణే తరువాయి. 24 గంటల పాటు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఫలితంగా పేదల ప్రాణాలకు ప్రభుత్వం రక్షగా నిలవబోతున్నది.
నాగర్‌కర్నూల్, ఆగస్టు 25 (నమస్తే తెలంగా ణ) : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో మెడికల్ క ళాశాల తరగతులు రెండు, మూడు నెలల్లో ప్రా రంభం కానున్నాయి. పేదలకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను త్వరితగతిన చేర్చేందుకు జి ల్లాలను ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ సదుపాయాల కల్పనలోనూ తన మార్క్‌ను చాటుతున్నా రు. జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు కూడా చే స్తామని సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ ఎట్టకేలకు అమలవుతున్నది. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలో 150 సీట్లతో మెడికల్ కళాశాల తరగతులు ప్రారంభం కాబోతున్నాయి.
ఎంసెట్ ఫలితాలు రావడంతో ఇక కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉన్నది. ఇది పూర్తయితే 2022-2023 విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్ ఫస్టియర్ తరగతులు జరగనున్నాయి. దీనికోసం 110 పడకలతో ఉన్న జిల్లా దవాఖానను జనరల్‌గా 320 పడకల తో అప్‌గ్రేడ్ చేశారు. గత జూన్‌లో ఈ దవాఖా న ను జాతీయ వైద్య సంస్థకు చెందిన మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు సభ్యులు సందర్శిం చి సంతృప్తి వ్యక్తం చేశారు. ల్యాబొరేటరీ, హాస్టల్, లైబ్రరీ, నర్సింగ్ స్టాఫ్ తదితర సదుపాయాలను పరిశీలించారు.
ఇప్పటివరకు కళాశాల భవనం, హాస్టల్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మెడికల్ కళాశాల మంజూరుకు మార్గం సు గమమైంది. ఈ నేపథ్యంలో ఉయ్యాలవాడ వద్ద 23 ఎకరాల స్థలంలో మెడికల్ కళాశాల నిర్మాణం చేపట్టగా శరవేగంగా నిర్మాణం చేపడుతున్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, కలెక్టర్ ఉదయ్‌కుమా ర్ పనులను పర్యవేక్షిస్తున్నారు. కళాశాలకు అవసరమైన 61 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పోస్టులను భర్తీ చేశారు. ఆర్ఎంవో, ప్రిన్సిపాళ్లు విధుల్లో చేరారు. అలాగే 34 మంది నాన్ టీచింగ్ వైద్య సిబ్బందిని నియమించాల్సి ఉన్నది. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులను స్వీకరించారు.
ఇటీవలే జూనియర్ అసిస్టెంట్లుగా నియమితులైన 20 మంది వీఆర్వోలు విధులు నిర్వహించనున్నా రు. జిల్లాలోని నాగర్‌కర్నూల్, కల్వకుర్తితోపాటు నల్లమలలోని అచ్చంపేట, కొల్లాపూర్ ప్రాంతాల్లో 27 పీహెచ్‌సీల్లో ప్రతి నెలా 70 వేల మంది చికిత్సలు తీసుకుంటున్నట్లు గుర్తించారు. ఇక జిల్లా, ఏరియా, ప్రైవేట్ దవాఖానలతో కలిపితే నెలకు లక్ష మంది వరకు చికిత్సలు తీసుకుంటారని అంచ నా. అయితే, అత్యవసర సమయాల్లో వైద్యం ఇ క్కడి ప్రజలకు అందని ద్రాక్షగానే మారింది. ము ఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, డెలివరీల్లో ఇబ్బందులతో చాలా మంది మృత్యువాతపడుతున్నారు.
మెడికల్ కళాశాలకు అనుబంధంగా జనరల్ దవాఖాన అందుబాటులోకి వస్తే వై ద్యం మరింత పురోగతి సాధించనున్నది. దీంతో ఆర్థోపెడిక్, అత్యవసరం, ట్రా మా, క్రిటికల్ కేర్, ఆప్తమాలజీ, డెర్మటాలజీ, డెంటిస్ట్, అనస్తీషియా, అనాటమీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ, గైనకాలజీ, ఎండోక్రినోలజీ, ఈఎన్ టీ, కుష్టు, బ్లడ్ బ్యాం క్ తదితర వైద్య సే వలు పేదల చెంతకు చేరనున్నాయి. అవి కూడా 24 గంటలూ ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం అత్యవసర చికిత్సలకు, ఇతర అనారోగ్యాల కోసం హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వె ళ్తున్నారు. దీంతో రూ.లక్షల్లో ఖ ర్చులు చేస్తున్నారు. మెడికల్ కాలేజీ ప్రారంభమైతే పే దల చెంతకు ప్రభుత్వ వైద్యం అందనను న్నది.
సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేశారు. రెండు నెలల్లో 150 సీట్లతో
మెడికల్ కళాశాల ప్రారంభమవుతుంది. దీంతో పేదలందరికీ ఉచితంగా 24 గంటలపాటు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. భవన నిర్మాణం త్వరలో పూర్తి అవుతుంది.
– మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్