వనపర్తి రూరల్, ఆగస్టు 21 : జిల్లాలోని ప్రతి పట్టణం,పల్లెలను హరితహారం ద్వారా పచ్చని పందిళ్లుగా మార్చాలని జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పెద్దగూడెం గ్రామశివారు, ఎకో పార్కుల సమీపంలో వజ్రోత్సవాల్లో భాగంగా కలెక్టర్ షేక్ యాస్మిన్బాషతో కలిసి పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరితహారం కింద ప్రతి పట్ట ణం, పల్లెలో ప్రకృతి వనాలు, నర్సరీలు, బృహత్ పల్లెప్రకృతి వనాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. జిల్లాలో కోటి మొక్కలు నాటేందుకు లక్ష్యం నిర్ధారించినట్లు వివరించారు. కలెక్టర్ షేక్‌యాస్మిన్‌బాషా మాట్లాడుతూ స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భా గంగా జిల్లాలోని 14 మండలాల్లోని 255 గ్రామ పంచాయతీల్లో మొ క్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.
జిల్లాలోని అటవీ సంపద తక్కువగా ఉన్నందున అ ధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో విరివిగా ప్రభు త్వ ఖాళీస్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు, పం టపొలాల్లోని గట్టుల వెంట రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి, పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. అనంతరం వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేసిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, డీఎఫ్‌వో రామకృష్ణ. డీఆర్డీవో నర్సింహులు, ము న్సిపల్ కమిషనర్ విక్రమ్‌సింహారెడ్డి, ఎంపీపీ కిచ్చారెడ్డి, సర్పంచ్ కొండన్న, ప్రజాప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అమరచింత, ఆగస్టు 21 : భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం పట్టణ శివారులోని ఇండియన్ పెట్రో ల్ బంక్ సమీపంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ము న్సిపల్ చైర్పర్సన్ మంగమ్మతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పక్షం రోజుల పాటు చేపడుతున్న ఈ వజ్రోత్సవాల్లో ప్రజల్లో స్వాతంత్య్రంపై మరింత అవగాహన కలిగేందుకు రోజు, రోజుకో కార్యక్రమం చేపడుతున్నమని వివరించారు.
కార్యక్రమంలో మాజీ వైస్‌చైర్మన్ నాగభూషణంగౌడ్, కౌన్సిలర్లు రాజ్‌కుమార్, సింధూజ, కోఆప్షన్ సభ్యులు రఫీ, కమిషనర్ రమేశ్, రెడ్‌క్రాస్ జిల్లా వైస్‌చైర్మన్ కలాంపాషా, మున్సిపల్ మేనేజర్ ఎల్లారెడ్డి, శానిటేషన్ వర్క్ఇన్స్పెక్టర్ సాయిఆధిత్య, అటెండర్ ప్రభాకర్, సిబ్బంది తిప్పన్న, హరికృష్ణ, శ్రీను, మహేందర్ తదితరులు ఉన్నారు.
అమరచింత, ఆగస్టు 21 : సీఎం కేసీఆర్ పిలుపుతో మండలంలోని చింతరెడ్డిపల్లి, మిట్టనందిమళ్ల తదితర గ్రామాల్లోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బడా చెన్నమ్మాకురుమన్న ఆధ్వర్యంలో గ్రామస్తులు మొక్క లు నాటారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్లారెడ్డి, వార్డు సభ్యులు సుధాకర్, ఆంజనేయులు, టీఆర్ఎస్ నాయకులు రాజు, కుర్మారెడ్డి, ముకుందం, వెంటకన్న ఉన్నారు.
పెద్దమందడి, ఆగస్టు 21 : నాటిన ప్రతిమొక్కను సంరక్షించి భవిష్యత్ తరాలకు కానుకగా అందిద్దామని ఫారెస్ట్ జిల్లా అధికారి రామకృష్ణ అన్నారు. ఆదివారం మండలంలోని జంగమాయిపల్లి శివారులోని ఫారెస్ట్‌లో సిబ్బందితో కలిసి ఆయన మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రతిఒక్కరూ తమతమ పొలాల్లో, ఇంటి ముం దు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని అన్నారు. మండలంలోని కేజీబీవీలో ఎంపీడీవో అఫ్జలుద్దీన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమాల్లో ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ మహేందర్‌తోపాటు ఆయా గ్రామాల సర్పంచులు, ఏపీవోలు, కేజీబీవో సిబ్బంది పాల్గొన్నారు.
కొత్తకోట, ఆగస్టు 21 : నాటిన మొక్కలను సంరక్షించే బా ధ్యత ప్రతిఒక్కరిపై ఉందని మున్సిపల్ చైర్పర్సన్ సుకేశిని అన్నారు. ఆదివారం స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా 6వ వార్డులో మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, వార్డు కౌన్సిలర్ సంధ్యా రవీందర్‌రెడ్డితో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా సుకేశిని మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల పట్టణం పచ్చదనంతో కళకళలాడుతుందని, అందుకోసం ప్రతిఒక్కరూ ఐదు పండ్ల మొక్కలతోపాటు మరో ఐ దు మొక్కలను నాటాలని సూచించారు. కార్యక్రమంలో కౌ న్సిలర్ పద్మాఅయ్యన్న, రామ్మోహన్‌రెడ్డి, ఖాజామైనుద్దీన్, మార్కెట్ డైరెక్టర్ వెంకటన్నగౌడ్, కోఆప్షన్ సభ్యుడు వసీంఖాన్, నాయకుడు హనుమంతుయాదవ్, మున్సిపల్ సి బ్బంది వెంకటయ్య, కృపయ్య తదితరులు పాల్గొన్నారు.
పాన్‌గల్, ఆగస్టు 21 : మొక్కలు నాటి పర్యావరణాన్ని కా పాడుకుందామని ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, ఎంపీడీవో నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం మండలంలోని పలుగ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమం లో తాసిల్దార్ యేసయ్య, ఎస్సై నాగన్న, సర్పంచ్ గోపాల్‌రెడ్డి, ఆర్ఐ మహేశ్వరం, పంచాయతీ కార్యదర్శి రఘుయాదవ్, ఏపీవో కురుమయ్య, టీఆర్ఎస్ నాయకులు బ్రహ్మ య్య, ఆదంరాజు తదితరులు పాల్గొన్నారు.
పెబ్బేరు రూరల్, ఆగస్టు 21 : మొక్కల పెంపకాన్ని ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఎంపీపీ ఆవుల శైలజ అ న్నారు. ఆదివారం పెబ్బేరు మండలం అయ్యవారిపల్లెలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభు త్వం చేపట్టిన హరితహారాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో రోజా, సర్పంచ్ స్వాతి, ఉపసర్పంచ్ మద్దిలేటి పాల్గొన్నారు.
ఖిల్లాఘణపురం, ఆగస్టు 21 : మొక్కలు పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయని అందుకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించడం బాధ్యతగా తీసుకోవాలని జెడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని కర్నెతండా, దొంతికుంటతండా అటవీ ప్రాంతాల్లో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మొక్కలు నా టారు.
ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలునాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ మొక్కలు పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడతాయని ప్రతిఒక్కరూ ఒక్కొక్క మొక్క నాటి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సామ్యానాయక్, ఎంపీవో, ఏపీవో, టీఏ, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆత్మకూరు, ఆగస్టు 21: హరితహారంలో నాటిన మొక్కలు వృక్షాలుగా మారి తరతరాలు చరిత్రకు గుర్తుండిపోతాయని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆదివారం మండలం వ్యాప్తంగా పెద్ద ఎత్తున హరితహారం మొక్కలు నాటారు. అన్ని గ్రామ పంచాయతీల్లో ఆయా పాలకవర్గాల నేతృత్వంలో హరితహారం మొక్కలు నాటారు.
ఆత్మకూరు మున్సిపాలిటీ పాలకవర్గం ఆధ్వర్యం లో ఈద్గా రోడ్డులో 2,500 మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రీయాదవ్, వైస్ చైర్మ న్ విజయభాస్కర్‌రెడ్డి, ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, వైస్‌ఎంపీపీ కో టేశ్వర్, పీఏసీసీఎస్ అధ్యక్షులు గాడి కృష్ణమూర్తి, లక్ష్మీకాంత్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్‌యాదవ్, కమిషనర్ రమేశ్, ఎస్సై రాఘవేందర్ తది తరులు పాల్గొన్నారు.
చిన్నంబావి, ఆగస్టు 21 : హరితహారం కార్యక్రమంలో భా గంగా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని ఎంపీపీ సోమేశ్వరమ్మ అన్నారు. ఆదివారం మండలంలోని లక్ష్మీపల్లిలో ఎంపీడీవో రవినారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వ తంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో జె డ్పీటీసీ వెంకటరామమ్మతో కలిసి ఆమె పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయనిప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ స్తులు తదితరులు ఉన్నారు.