స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లావ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని మొక్కలు నాటారు. ప్రతి జీపీలో ఒకే రోజూ 500 మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకున్నారు. గ్రామాల్లో రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి వాటికి రక్షణగా కంచె నిర్మాణం చేపట్టారు.
అలాగే ప్రతి ఇంటికీ మొక్కలను పంపిణీ చేశారు. నారాయణపేటలో కలెక్టర్ హరిచందన, కోస్గి, పేట మున్సిపల్ చైర్పర్సన్లు, అనసూయ, శిరీష, మక్తల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పులువురు మాట్లాడుతూ గ్రామాల్లో హరితవనాలు పెంచేందుకు యువత, విద్యార్థులు, మహిళా సంఘా లు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు కృషి చేయాలన్నారు. మొక్కలతో వా తావరణ కాలుష్యాన్ని నివారించవచ్చన్నారు. హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని, మొక్కలు నాటడంతోపాటు సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 21