పాలమూరు, ఆగస్టు 21 : పాలమూరు యూనివర్సిటీలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులకు సూచించారు. పీయూలో రూ.1.95కోట్లతో నిర్మించిన వైస్‌చాన్స్‌లర్ నివాస సముదాయాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీయూలో లా, జర్నలిజం కళాశాలల ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూ చించారు. విద్యార్థులకు అవసరమైన వసతులను సమాకూరుస్తామని తెలిపారు.
అ లాగే నాన్‌టీచింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం వైస్‌చాన్స్‌లర్ నివాస సముదా యం ఆవరణలో మొక్కలు నాటారు. అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిట్నెస్, స్పో ర్ట్స్ సైన్స్ నవీన పోకడలపై ఏర్పా టు చేసిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్ పోస్టర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్, రిజిస్ట్రార్ గిరిజామంగతాయారు, ఖేలో ఇండియా ప్రత్యేకాధికారి సోమలిం గం, అధ్యాపకులు మధుసూదన్, రాజ్‌కుమార్, ప్రిన్సిపాల్ కిశోర్ పాల్గొన్నారు.