మక్తల్ టౌన్, ఆగస్టు 5 : మక్తల్ నియోజకవర్గం అభివృ ద్ధి పథంలో ముందుకు సాగుతున్నదని ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్రెడ్డి అన్నారు. పట్టణంలోని నల్లజానమ్మ ఆల యం వద్ద నేషనల్ హైవే 167 విస్తరణలో భాగంగా కొనసాగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులు, అదేవిధంగా రోడ్డు విస్తరణ పనులను శుక్రవారం ఎమ్మెల్యే పరిశీలించి త్వరగా ప నులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపట్టిన అభి వృద్ధి పథకాలతో మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామ స్థాయిలో కూడా ప్రజలు హర్షం వ్యక్తం చే స్తున్నారన్నారు. అదేవిధంగా నియోజకవ ర్గ రైతులు అధిక వర్షాలతో పత్తి పంటను కాపాడుకునేందుకు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు సూచనలతో పంటలపై చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయాధికారులు ప్రతి గ్రామంలో రైతులకు అధి క వర్షపాతానికి పంటలు పాడవకుండా తీ సుకోవాల్సిన జాగ్రత్తలు సూచించాలన్నా రు.
నియోజకవర్గంలో చిట్టెం నర్సిరెడ్డి రిజర్వాయర్, భూత్పూర్ రిజర్వాయర్ల కింద ఉన్న అన్ని చెరువులు నిండుకున్నాయని, లక్షా20వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ప్ర భుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి లబ్ధిదారుడికి చే రుతుందన్నారు. నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలతోపాటు మిగతా మండలాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయన్నారు. 24 గంటలపాటు ప్రజలకు అందుబాటు లో ఉంటానని, నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముం దుకు సాగుతానని ఆయన తెలిపారు.