నవాబ్‌పేట, జూలై 28 : భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ధరణిలో తొమ్మిది కొత్త ఆప్షన్లు ప్రవేశపెట్టినట్లు కలెక్టర్ ఎస్.వెంకట్రావు పేర్కొన్నారు. నవాబ్‌పేట ప్రభుత్వ దవాఖాన, తాసిల్దార్ కార్యాలయాన్ని గురువారం తనిఖీ చేశారు. అనంతరం యన్మన్గండ్లలో పల్లెప్రకృతి వనం, తూక్యాతండా, సీతమ్మతండాల్లో కలెక్టర్ ప ర్యటించి గిరివికాసం లబ్ధిదారుల వివరాల ను తెలుసుకున్నారు.
అనంతరం తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల్లో భూముల తప్పులను సరి చేసేందుకు ఆప్షన్స్ వచ్చాయని తె లిపారు. లావాణి పట్టాలపై తాసిల్దార్లు ప్రత్యేక దృష్టి సారించి తగిన ఆధారాలు ఉం టేనే చేయాలని సూచించారు. జిల్లావ్యాప్తం గా 29వేల పెండింగ్ భూసమస్యల ను పరిష్కరించినట్లు వివరించారు.
1592 అసైన్మెంట్ భూసమస్యలకు సంబంధించి దరఖాస్తులు రాగా, 98శాతం పరిష్కరించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న గిరివికాసం పథకాన్ని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మండలంలో 15మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో లక్షా 49వేల మంది విద్యార్థులకు వైద్యపరీక్షలు చేయించినట్లు చెప్పారు.
గ్రామాల్లో పా రిశుధ్యం లోపించకుండా అధికారులు చర్య లు తీసుకోవాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో తాసిల్దార్ రాజేందర్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీలత, ఎంపీవో భద్రూనాయక్, ఏపీవో జ్యోతి, ఈ సీ ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.