నాగర్‌కర్నూల్, జూలై 24: జిల్లాలో 2020-21 ఏడాదికి సంబంధించిన సీఎంఆర్ బియ్యాన్ని సంబంధిత మిల్లర్లు త్వరగా అందించాలని అదనపు కలెక్టర్ మోతీలాల్ ఆదేశించారు. ఆదివారం తిమ్మాజిపేట, బిజినేపల్లి, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి మండలాల్లోని పలు రైస్‌మిల్లులను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ఆదేశాల మేరకు జిల్లాలోని 108 మిల్లర్లు 40 వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం వెంటనే మిల్లింగ్ చేసి అందించాలని సూచించారు.
ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా 40వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని అందించేందుకు మిల్లర్లు చర్యలు చేపట్టాలని సూచించారు. మిల్లర్లు సీఎంఆర్ బియ్యాన్ని సంబంధించి నివేదికలు కార్యాలయంలో అందించాలని సూచించారు. ఆయన వెంట డీఎంవో మోహన్‌బాబు, డీఎం బాలరాజు, మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.
కల్వకుర్తి రూరల్, జూలై 24 : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా మొక్కలు నాటి సంరక్షించుకుందామని అదనపు కలెక్టర్ మోతీలాల్ పిలుపునిచ్చారు. ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం, తాసిల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ మోతీలాల్ మొక్కలను నాటి నీటిని పోశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో హరితహారంలో భాగంగా మొక్కలను విరివిగా నాటి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్‌కుమార్, తాసిల్దార్ రాంరెడ్డి, సిబ్బంది ఉన్నారు.
కల్వకుర్తి, జూలై 24 : పట్టణంలో ఉన్న రైస్ మిల్లులను అదనపు కలెక్టర్ మోతీలాల్ ఆదివారం తనిఖీ చేసి మిల్లులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీవో రాజేశ్‌కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మోహన్‌బాబు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జూలురి రమేశ్‌బాబు, పట్టణ రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు పోలా ఏకనాథం, రైస్ మిల్లర్స్ తదిత రులు పాల్గొన్నారు.
వెల్దండ, జూలై 24 :ప్రతిఒక్కరూ విధిగా మొక్కలు నాటి సంరక్షించాలని అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా సివిల్ సైప్లె అధికారి మోహన్ బాబు అన్నారు. మండలకేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద ఆదివారం తాసిల్దార్ చంద్రశేఖర్ తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మొక్కలు నాటి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.