కోడేరు, జూలై 24 : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటాలు చేయాలని సీపీఎం రాష్ట్ర నాయకుడు కిల్లె గోపాల్ పిలుపు నిచ్చారు. కోడేరులోని సీపీఎం పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సీపీఎం మండల స్థాయి శిక్షణా తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని వదిలివేసి సంపన్న వర్గాలకు పని చేస్తున్నదన్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నూనెల ధరలను పెంచి సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణకు, మతోన్యాదానికి, కార్పొరేటు శక్తులకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి నర్సింహ, కార్యకర్తలు పాల్గొన్నారు.
అచ్చంపేటరూరల్, జూలై 24 : కేంద్రంలో అధికారంలో ఉన్న మతోన్మాద బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు అన్నారు. ఆదివారం పట్టణంలోని టీఎన్జీవో భవనంలో జరిగిన నియోజకవర్గ స్థాయి శిక్షణా తరగతులు శంకర్‌నాయక్ అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు గడుస్తున్న ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దేశ్యానాయక్, కార్యదర్శులు మల్లేశ్, శంకర్‌నాయక్, నాయకులు సైదులు, పార్వతమ్మ, నరేందర్, బక్కయ్య, కృష్ణయ్య, మహేందర్, భాస్కర్, కృష్ణ, బాలు, పార్వతమ్మ, నిర్మల పాల్గొన్నారు.
పెద్దకొత్తపల్లి, జూలై 24 : కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో పాలు, పెరుగు నిత్యావసరాలపై విపరీతంగా పన్ను పెంచడంతో గ్రామాల్లో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, జీఎస్టీపై పన్ను ఎత్తి వేసే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆ పార్టీ మండలాధ్యక్షుడు కృష్ణయ్య తెలిపారు. జీఎస్టీ ఎత్తివేయాలని మండల కేంద్రంలో కార్యకర్తలతో ఆందోళన నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు ఉన్నారు.