నాగర్‌కర్నూల్, జూలై 24: ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు వేడుకలను ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కేక్‌ను కట్‌చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి నాయకత్వం వర్థిల్లాలి అంటూ నినాదాలు చే శారు.
భవిష్యత్తు తెలంగాణకు ఆశాకిరణం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ నినాదాలు చేస్తూ సంబురాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కల్పనాభాస్కర్‌గౌడ్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అధ్యక్షుడు ధర్మరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుమల్‌యాదవ్, నాయకులు భాస్కర్‌గౌడ్, పాండూనాయక్ తదితరులు పాల్గొన్నారు.
కల్వకుర్తి, జూలై 24 : మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఆదివారం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. కల్వకుర్తి మండల టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకులు మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని కేట్‌కట్ చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు విజయ్‌గౌడ్, శ్రీకాంత్, లింగం, సర్పంచ్ జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆదివారం మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కల్వకుర్తి టీఎన్జీవో కాలనీలో గిఫ్ట్ ఏ స్మైల్ కింద మొక్కలు నాటారు. కార్యక్రమంలో జాగృతి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు గణేశ్, పీఆర్వో ఆరీఫ్, ఇమ్రాన్, అబ్దుల్లా, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
వంగూరు, జూలై 24 : టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను కేటీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం మండలకేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు.
అనంతరం పండ్లను పంచిపెట్టారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, కేటీఆర్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు అంకు సురేందర్, సింగిల్ విండో చైర్మన్ సురేందర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు గణేశ్‌రావు, జెడ్పీ కో-ఆప్షన్ హామీద్, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు లాలూయాదవ్, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వెల్దండ, జూలై 24 : మండలకేంద్రంలో ఆదివారం మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నేత గోళి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని సర్పంచులు, నాయ కులతో కలిసి కేక్ కట్ చేశారు. అదేవిధంగా వెల్దండలో టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు జంగిలి యాదగిరి ఆధ్వర్యంలో, చెర్కూర్‌లో టీఆర్ఎస్ నాయకులు రాజశేఖర్, భీమ్రాజ్ ఆధ్వర్యంలో, పెద్దాపూర్ గేటు వద్ద కశిరెడ్డి యువసేన నాయకుడు కృష్ణ ఆధ్వర్యంలో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.
కార్యక్రమంలో సర్పంచులు గోరటి శ్రీను, అంజి నాయక్, పెద్ది రామకృష్ణ, పత్యానాయక్, సింగిల్ విండో డైరెక్టర్ నాగులు నాయక్, టీఆర్ఎస్ మండల నాయకులు తిరుమల రావు, రాజశేఖర్, ఉప సర్పంచుల సంఘం అధ్యక్షుడు గుమ్మకొండ రాజు, చెర్కూరు ఉప సర్పంచ్ నరసింహ ముదిరాజ్, వార్డు సభ్యులు భీమ్రాజ్, లాలయ్య, ఆమనగల్లు వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, ఆమనగల్లు మార్కెట్ డైరెక్టర్ సుభాష్, తలకొండపల్లి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్‌రెడ్డి, వీరారెడ్డి మాజీ బీఎంసీ యూత్ అధ్యక్షుడు కూన దశరథం, తారాసింగ్, గిరి, రాము, జగన్, గణేశ్, వడ్డెమోని శివ, ఆదివాసి, సుమన్, నాగిరెడ్డి, రవి, సతీశ్, శంకర్‌నాయక్ ఉన్నారు.
తెలకపల్లి , జూలై 24: మండలకేంద్రంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి ఆదేశానుసారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు. కార్యక్రమంలో మండల టౌన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, ఎస్సీసెల్ అధ్యక్షుడు శివ, మండల రైతు కమిటీ అధ్యక్షుడు సుందర్‌రెడ్డి, బీసీసెల్ అధ్యక్షులు నర్సింహ, మం డల మైనార్టీ సెల్ అధ్యక్షుడు గౌస్ ఉన్నారు.