మక్తల్ టౌన్, జూలై 24 : ప్రభుత్వ దవాఖాన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మక్తల్ మున్సిపాలిటీలోని ప్రభుత్వ దవాఖాన ఆవరణలో మున్సిపల్ చైర్పర్సన్ పావని ఆధ్వర్యం లో ఆదివారం హరితహారంలో భాగంగా మొక్కలు ఎమ్మె ల్యే నాటారు. దవాఖానను శుభ్రంగా ఉంచాలని మున్సిప ల్ అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ వాహనాలు పార్కిం గ్ చేయడం వల్ల దవాఖానకు వచ్చే రోగుల వాహనాలకు ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు.
దవాఖాన లోపల ప్రైవే ట్ వాహనాలు నిలుపరాదని వెంటనే తీసివేయాలని పోలీసులు, వైద్య సిబ్బందికి సూచించారు. టాయిలెట్స్, ప్రహరీ ని పరిశీలించి ప్రహరీకి అనుకోని ఉన్న గ్రౌండ్‌కు కంచె వే యించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. రోగులను ఆప్యాయంగా పలకరించి కనీస సౌకర్యాలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
త్వరలో 150 పడకలతో అన్ని రకాల సదుపాయాలతోపాటు 24గంటలు డాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా అధునాతన భవనాన్ని రూ.33కోట్లతో నిర్మించబోతున్నామన్నారు. మక్తల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు సీఎం కేసీఆర్ రాబోతున్నారన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అ ఖిల, కమిషనర్ కె.నర్సింహ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహాగౌడ్, డాక్టర్ శ్రీకాంత్, కౌన్సిలర్లు, మున్సిపల్ సి బ్బంది, వైద్య సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు తదితరు లు పాల్గొన్నారు.