రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి తారక రామారావు జన్మదిన వేడుకలను జిల్లావ్యాప్తంగా ఆదివారం టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకొన్నారు. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల్లో ఎస్.రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు టీఆర్ఎస్ మండలాల అధ్యక్షుల ఆధ్వర్యంలో కేక్‌కట్ చేశారు. అదేవిధంగా హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం, రక్తదాన కార్యక్రమాలు, పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అనాథ ఆశ్రమంలో పిల్లలకు పండ్లు, దుస్తులు సరఫరా, ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు అందజేశారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం పరితపిస్తున్న మంత్రి కేటీఆర్ దే శానికే ఆదర్శవంతమైన నాయకుడని, ఆయనకు ఆయురారోగ్యా లు ప్రసాదించాలని పలువురు నాయకులు దేవుళ్లను ప్రార్థించారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 24