జడ్చర్ల, జూలై 24 : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఆదివారం పార్టీ నాయకులు ఘనంగా జరుపుకొన్నారు. జడ్చర్లలో నిర్వహించిన కేటీఆర్ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రగతికి అనునిత్యం పరితపించే నిరంతర శ్రామికుడు కేటీఆర్ అని అన్నారు. పారిశ్రామికవేత్తలతో మాట్లాడి రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చేలా చేస్తున్నారని తెలిపారు.
మొక్కల పెంపకంతోనే మానవాళి మనుగడ సాధ్యమవుతుందని, ప్రతిఒక్కరూ పెద్దఎత్తున మొ క్కలు నాటి పెంచాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కోరా రు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా జ డ్చర్లలో మహిళా సంఘాలు, పట్టణ ప్రజలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ వాతావరణ సమతుల్యత కోసం ము ఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 250కోట్ల మొక్కలను నాటినట్లు పేర్కొన్నారు.
మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవడంవల్ల 80-90శా తం మొక్కలు బతికి ఎదుగుతున్నాయని తెలిపారు. లేఅవుట్లలోని ప్రతి రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన లేఅవుట్లల్లో కూడా మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
కా ర్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, కౌన్సిలర్లు కోట్ల ప్రశాంత్‌రెడ్డి, లత, నవనీతాకొండల్, సతీశ్, రమేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు కాట్రపల్లి లక్ష్మయ్య, మురళి, ము న్సిపల్ కమిషనర్ మహమూద్‌షేక్, మేనేజర్ శశికాంత్, టీఆర్ఎస్ నాయకులు దోనూర్ శ్రీనివాస్‌రెడ్డి, బీకేఆర్, నాగిరెడ్డి, ఇమ్మూ, పర్వత్‌రెడ్డి, మెకానిక్ సత్యం, మనోహర్, పాండయ్య, సంగమేశ్వర్, రవీందర్, భీంరాజ్, చందూనాయక్, రా మ్మోహన్, శ్రీనివాసులు, గోపాల్ పాల్గొన్నారు.
భూత్పూర్, జూలై 24 : మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను భూత్పూర్లో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా ని ర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. అలాగే మంత్రి కేటీఆర్ త్వర గా కోలుకోవాలని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, మత్స్యసహకార సంఘం ఇన్చార్జి సత్యనారాయణ, కౌన్సిలర్లు శ్రీనివాస్‌రెడ్డి, రామకృష్ణ, ముడా డైరెక్టర్లు చంద్రశేఖర్‌గౌడ్, సాయిలు, వైస్‌ఎంపీపీ నరేశ్‌గౌడ్, నాయకులు స త్తూర్ నారాయణగౌడ్, గడ్డం రాములు, బోరింగ్ నర్సింహులు, అశోక్‌గౌడ్, రాము రాథోడ్, ప్రేమ్‌కుమార్, యాదయ్య, శివరాజు పాల్గొన్నారు.
దేవరకద్ర రూరల్, జూలై 24 : చిన్నచింతకుం ట మండలకేంద్రంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్యకేం ద్రం ఆవరణలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం ఆశ కార్యకర్తలకు ఆరోగ్య కిట్లను అందజేశారు. దవాఖానలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.
అదేవిధంగా దేవరకద్రలో టీఆర్ఎస్ యువ నాయకులు చల్మారెడ్డి, శివానంద్, అంబేద్కర్, రాము, యాదయ్య, జక్కి, భార్గవ్ తదితరులు పీహెచ్సీలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, సర్పంచ్ మోహన్‌గౌడ్, ఎంపీటీసీ ఉషారాణి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కరుణాకర్‌రెడ్డి, కురుమూర్తి ఆలయ కమి టీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, నాయకులు వజీర్‌బాబు, కరుణాకర్‌గౌడ్, డాక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి, యాకోబ్ తదితరులు పాల్గొన్నారు.
రాజాపూర్, జూలై 24 : మండలకేంద్రంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ దవాఖానలో రోగుల కు పాలు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, యూత్వింగ్ అ ధ్యక్షుడు వెంకటేశ్, యాదగిరి, ఆనంద్‌గౌడ్, దేవేందర్, శ్రీనివాస్, పాండూనాయక్, తిరుపతయ్య, నర్సింహులు, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
బాలానగర్, జూలై 24 : మండలంలోని కేతిరెడ్డిపల్లిలో మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ కల్యాణీలక్ష్మణ్నాయక్ కేక్ కట్ చేశారు. అనంతరం మొక్కలు నాటి నీరు పోశారు. అలాగే మండలకేంద్రంలో టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బాలూనాయక్, యూత్వింగ్ అధ్యక్షుడు సుప్ప ప్రకాశ్, ఎస్టీసెల్ ఉపాధ్యక్షుడు రమేశ్‌నాయక్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మూసాపేట(అడ్డాకుల), జూలై 24 : అడ్డాకుల మండలంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలకేంద్రంలో కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం మంత్రి కోలుకోవాలని ఆలయాల్లో పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగార్జునరెడ్డి, రైతుబంధు సమితి మండ ల అధ్యక్షుడు బొక్కలపల్లి తిరుపతిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ మద్దూరి జితేందర్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ఖాజాగోరి, సుజాత, బాలరాజు, ఆంజనేయులు, శ్రీనివాసులుయాదవ్, కొండన్న, శ్రీనివాసులుగౌడ్, రాము, సంజీవరెడ్డి, దానేల్, సాయిలు, మన్యం తదితరులు పాల్గొన్నారు.
మూసాపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు వేముల అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశా రు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్, బీసీసెల్ అధ్యక్షుడు గూ పని కొండయ్య, యూత్ అధ్యక్షుడు చంద్రశేఖర్, మాజీ వైస్‌ఎంపీపీ మశ్చేందర్నాథ్, నాయకులు కోట్ల రవి, రవివర్ధన్, నర్సింహారెడ్డి, కృష్ణయ్యగౌడ్, సత్యనారాయణ, మహేందర్, నారాయణ, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
నవాబ్‌పేట, జూలై 24 : మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మండలంలోని కొల్లూరులో ప్రజాప్రతినిధులు, నాయకులు గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేశారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ చందర్‌నాయక్, నాయకులు రఘు, లక్ష్మయ్య, యాదయ్యగౌడ్, రఘుగౌడ్, గోపాల్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 24 : మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆల్ఫైజ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో పేదలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సొ సైటీ అధ్యక్షుడు జహంగీర్‌బాబా పాల్గొన్నారు.