మహబూబ్‌నగర్, జూలై 24: కులమతాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో కాంగ్రెస్, ఎంఐఎం, టీడీపీల నుంచి భారీగా టీఆర్ఎస్లో చేరా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధి కో సం ఇతర జిల్లాలకు వెళ్లే రోజులకు కాలం చెల్లిందని, పనికోసం పాలమూరుకు వస్తున్నారన్నారు.
కష్టపడి పనిచేసే వారికి సరియైన సమయంలో గుర్తింపు లభిస్తుందని, ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీ నుంచి మాజీ కౌన్సిలర్ యాదయ్య, గోనెల అశోక్, గోనెల బాల్నాగయ్యతోపాటు సుమారు 100 మంది, షాషాబ్గ్టుకు చెందిన మహ్మద్ అజారుద్దీన్ ఆధ్వర్యంలో 100మంది, మదీన మసీదుకు సం బంధించిన కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ సయ్యద కలీమోద్దీన్ ఆధ్వర్యంలో 200మంది, ఎంఐఎం నాయకులు వాజీద్ ఆధ్వర్యంలో 300మంది పార్టీలో చేరా రు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహు లు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు శివరాజ్, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి వినోద్, మైనార్టీ నాయకులు మక్సూద్, జహంగీర్ ఉ న్నారు. హైదరాబాద్‌లోని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ క్యాం పు కార్యాలయంలో చిన్నదర్పల్లికి చెందిన యూత్ కాం గ్రెస్ కార్యదర్శి శివశంకర్‌గౌడ్ టీఆర్ఎస్లో చేరారు.
మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 24: వ్యాపారస్తులకు అండగా ఉంటానని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. పట్టణంలోని ఏనుగొండ జేజేఆర్ ఫంక్షన్హాల్లో ఆదివారం వెండి, బంగారు వ్యాపారుల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2014కంటే ముందు వ్యాపారాలు ఎలా ఉండేవి.. ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒకసారి బేరీజు వేసుకోవాలన్నారు. రైతులు, అన్ని వర్గాల ప్రజల ఆర్థిక స్థితిగతుల వల్ల పట్టణంలో అన్నిరకాల వ్యాపారాలు మెరుగయ్యాయన్నారు.
వ్యాపారులు తమతో పనిచేసే కార్మికులకు అండగా ఉండాలన్నారు. అదేవిధంగా వ్యాపార సంఘం భవనం కోసం స్థలం కేటాయించాలని కోరారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులచే మంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహెమాన్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ముడా చైర్మన్ గంజివెంకన్న, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, నాయకులు గోపాల్‌యాదవ్, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జూలై 24: అనాథశ్రమంలోని చిన్నారులతో కలిసి ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి తినిపించారు. ఈ సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని ఏనుగొండ అనాథాశ్రమంలో చిన్నారులకు దుప్పట్లు, పండ్లు, బ్యాగులు, ఇతర విలువైన వస్తువులు పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. హ్యాపీ బర్త్ డే టూ కేటీఆర్, లాంగ్ లివ్ కేటీఆర్ అంటూ చిన్నారులతో కలిసి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, రెడ్‌క్రాస్ చైర్మన్ నటరాజ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, కౌన్సిలర్ పటేల్ ప్రవీణ్ పాల్గొన్నారు.