లింగాల, జూలై 23 : పత్తిపంటలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయాధికారి నాగార్జునరెడ్డి అన్నా రు. శనివారం మండలంలోని సూరాపూర్, లింగాల గ్రామాల శివారులో సాగు చేసిన పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి నాగార్జునరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న ముసురు వర్షాలకు పత్తి పంటను రసం పీల్చే పురుగు ఆశించి పంటలను నాశనం చేస్తున్నదన్నారు. వాటి రక్షణకు వ్యవసాయాధికారుల సూచనలు, సలహాల మేరకు మందులను పిచికారీ చేసుకోవాలని రైతులను కోరారు. కార్యక్రమంలో రైతులు రాజశేఖర్‌రావు, కోనేటి తిరుపతయ్య పాల్గొన్నారు.
ఉప్పునుంతల, జూలై 23 : మండలంలోని కొరటికల్, వెల్టూర్ గ్రామాల్లో రైతులు సాగుచేసిన పత్తిపంటను శనివారం సంబంధిత క్లస్ట ర్ ఏఈవో భరత్‌కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలం లో రైతులు సాగుచేసిన పత్తి పంట ఆశాజనకంగా ఉందన్నారు. అక్కడక్కడ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పత్తిపంట ఎర్రగా మారుతుందని, అలాగే రసం పీల్చే పురుగు ఆశించనున్నట్లు ఆయన తెలిపారు. అందుకుగాను రైతులు మెగ్నీషియం సల్ఫేట్, 19-19-19, మోనోక్రోటోఫాస్ మందును నీటి లో కలిపి పిచికారీ చేయాలన్నారు. ముఖ్యం గా రైతులు సాగు చేసిన పంటలకు ఆశించే తెగుళ్లపై వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలను పాటిస్తే అధిక దిగుబడి సాధించవచ్చాన్నారు.
బల్మూరు, జూలై 23 : గ్రామాల్లో వ్యవసాయం చేసే రైతులు వరిలో వెదజల్లే పద్ధతిలో ఎన్నో లా భలు ఉన్నయని ఏవో మహేశ్ అన్నారు. శనివారం మం డలంలోని మైలారం, గోదల్ గ్రామాల్లో రైతులకు వెదజల్లే పద్ధతిపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈపద్ధతి లో వ్యవసాయం చేస్తే ఎకరానికి రూ.7వేలు కూలీ ఖర్చు తగ్గుతుందన్నారు. రైతులు భూములను పరీక్ష చేయించుకోవాలని, అధికారులు చెప్పిన పంటలను మాత్రమే భూ ముల్లో పంటలను వేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఏఈవోలు పవణ్కుమార్, ప్రశాంత్, సర్పంచు లు లక్ష్మమ్మ, శ్రీనివాసులు, ఎంపీటీసీ అంకులయ్య, నా యకులు భగవాన్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.