వనపర్తి, జూలై 23(నమస్తే తెలంగాణ): వైద్య విద్యనభ్యసించే విద్యార్థులకు వనపర్తి జిల్లాకేంద్రంలో మెడికల్ కళాశాల భవనం సిద్ధంగా ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మార్చి 8వ తేదీన సీఎం కేసీఆర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో నాలుగు నెలల్లో పూర్తిచేసినట్లు తెలిపారు. మెడికల్ కళాశాల భవనాన్ని కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషాతో కలిసి మంత్రి నిరంజన్‌రెడ్డి శనివారం పరిశీలించి మాట్లాడారు. 5ల్యాబ్‌లు, రెండు హాల్ల నిర్మాణం పూర్తయిందన్నారు. కళాశాల భవన నిర్మాణం జరుగాల్సి ఉందని, ప్రస్తుతానికి మెడికల్ కళాశాల కోసం నర్సింగ్ కళాశాలను యుద్ధప్రాతిపదికన నిర్మించామన్నారు. ప్రస్తుతానికి నర్సింగ్ కళాశాలలో మెడికల్ కళాశాల కొనసాగుతుందన్నారు.
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరిశీలించి అనుమతులు ఇచ్చేలా సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎంసెట్ పరీక్ష పూర్తయినందున వాటిలో వచ్చే ర్యాంకు ఆధారంగా వనపర్తి మెడికల్ కళాశాలకు మెడిసిన్ విద్యార్థుల మొదటి బ్యాచ్ నిర్వహించనున్నారు. విద్యార్థులకు సీట్లు కేటాయించే నాటికి క్యాంపస్‌తోపాటు వసతిగృహాలు అందుబాటులోకి వస్తాయన్నారు.
ఆహ్లాదకరమైన వాతావరణంలో మిగతా కళాశాలలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. భవన నిర్మాణానికి సహకరించిన అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు. మిగిలిన పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, సెంగ్వాన్, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్‌చైర్మన్ వాకిటి శ్రీధర్, తాసిల్దార్ రాజేందర్‌గౌడ్, మెడికల్ సూపరింటెండెంట్ నరేందర్‌కుమార్, దవాఖాన సూపరింటెండెంట్ రాజ్‌కుమార్, సింగిల్‌విండో చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, కౌన్సిలర్లు సత్యంసాగర్, పుట్టపాక మహేశ్, నాగన్న, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆవుల రమేశ్, యూత్ మండల కార్యదర్శి గణేశ్, టీఆర్ఎస్ నాయకులు శేఖర్‌నాయక్, జూత్రునాయక్ పాల్గొన్నారు.
వనపర్తి, జూలై 23: ప్రజల అభినందనలే ఉత్సాహాన్నిస్తాయని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా చైర్మన్ పదవికి నిరంజన్పాషా రాజీనామా చేసి శనివారం మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మంత్రి పార్టీ కండువాకప్పి సాదరంగా ఆహ్వానించి మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, వైస్‌చైర్మన్ వాకిటి శ్రీధర్, పట్టణ ప్రధాన కార్యదర్శి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి, జూలై 23: హరితహారం కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో మొక్కలు నాటాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం హరితహారం ప్లాంటేషన్, కొంకన్పల్లి భూనిర్వాసితుల సమస్యలపై కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషాతో కలిసి మంత్రి మాట్లాడారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో, గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటాలన్నారు. అనంతరం కొంకన్పల్లి భూనిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. రోడ్ల విస్తరణ పనుల్లో సమస్యలు ఉంటే పరిష్కరించి, పనులు వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఆశిష్సంగ్వాన్, వేణుగోపాల్, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్‌చైర్మన్ వాకిటి శ్రీధర్, కమిషనర్ విక్రమసింహారెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.