మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 23: చదువుతోనే బంగారు భవిష్యత్ ఉంటుందని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాకేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో చదివిన వారిలో 500మందికిపైగా 10 జీపీఏ సాధించడం గొప్ప విషయమన్నారు. బాలికలకు 10జీపీఏ రావడం సంతోషంగా ఉందన్నారు.
విద్యార్థులు సెల్ఫోన్లకు దూరంగా ఉండాలని, అతిగా వాడితే భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ విద్యపై ప్రత్యేకదృష్టి సారించారని తెలిపారు. అనంతరం 10జీపీఏ సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీబీ అధ్యక్షుడు నిజాంపాషా, సీనియర్ పీపీ బెక్కం జనార్దన్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజివెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహెమాన్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, డీఈవో రవీందర్, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్జీ, మాధవి, రాంచందర్‌జీ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్, జూలై 23: స్వరాష్ట్రంలోనే రెట్టింపు రైస్‌మిల్లులు ఏర్పాటు చేసినట్లు ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో శనివారం సంఘం నూతన కార్యవర్గ సమావేశానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరై కార్యవర్గాన్ని ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గతంలో రైస్‌మిల్లులకు కరెంట్‌లేక ఇబ్బందులతో నెట్టుకొచ్చారని, నేడు ఆ పరిస్థితులు లేవన్నారు. అడుగకముందే పరిశ్రమలకు 24గంటల విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.
అదేవిధంగా రైతులకు 24గంటల విద్యుత్, రైతుబంధు, రైతుబీమాతోపాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు గుర్తుచేశారు. రైస్‌మిల్లర్లకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. దరఖాస్తు చేసుకున్న 68రైస్‌మిల్లుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పూర్తిస్థాయిలో రైస్‌మిల్లులకు అండగా ఉంటుందని, ఎవరూ దిగులు చెందాల్సిన అవసరం లేదన్నారు.
అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను గజమాలతో సత్కరించి మెమోంటో అందజేశారు. కార్యక్రమంలో రైస్‌మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్నముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
దళితబంధుతో దళితులు ఆర్థికాభివృద్ధి చెందుతారని రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కోయిల్‌కొండ ఎక్స్‌రోడ్డులో దళితబంధుతో ఏర్పాటుచేసిన బాలాజీ ఎలక్ట్రికల్ వర్క్‌షాపును శనివారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు.
మహబూబ్‌నగర్‌రూరల్, జూలై 23: స్వాతంత్య్ర ఉద్యమంలో బాలగంగాధర్ తిలక్ సేవలు మరువలేనివని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా జిల్లాకేంద్రంలోని క్లాక్‌టవర్ వద్ద విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, మాజీ చైర్మన్ రాజేశ్వర్, మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.