నారాయణపేట టౌన్, జూలై 23 : జిల్లా దవాఖాన ప్రాంగణం, దవాఖాన లోపల పరిశుభ్రతను పాటించాలని కలెక్టర్ హరిచందన సూచించారు. రెడ్‌క్రాస్ సొసైటీ, లయ న్స్ క్లబ్ సభ్యులతో కలిసి శనివారం పట్టణంలోని జిల్లా దవాఖానలో ప్రసూతి రోగులకు దుప్పట్లు, శానిటేషన్ సి బ్బందికి హైజినిక్ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం అ నాథ ఆశ్రమంలో పిల్లలకు దుప్పట్లను పంపిణీ చేయడం తోపాటు మొక్కలు నాటారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ సుదర్శన్‌రెడ్డి, దవాఖాన సూపరింటెండెంట్ రంజిత్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ సునీత, లయన్స్ క్లబ్ మండల అధ్యక్షుడు జనార్దన్, రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు జగదీశ్, చెన్నారెడ్డి, ఆత్మారాం ఎడ్కే, సాయినాథ్, బాలాజీ, సత్యనారాయణ, ఆనంద్ చా రి తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య శాఖ సూచనల మేరకు దవాఖానలో సిజేరియన్ ప్రసవాలు చేయరాదని, సాధారణ ప్రసవాలనే చేయాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా దవాఖానలోని పలు వార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిజేరియన్ ప్రసవాలు చేసుకుంటే భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయన్నారు.
సాధారణ ప్రసవాలకే కుటుంబ సభ్యులను ప్రోత్సహించాలన్నారు. ప్రసవ సమయంలో సిజేరియన్ చేయాలని డాక్టర్లపై ఒత్తిడి చేయరాదన్నారు. గర్భిణు లు ప్రతినెలా వైద్య పరీక్షలు నిర్వహించుకుంటూ వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తే సాధారణ ప్రసవాలు అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, నర్సింగ్ సూపరింటెండెంట్ సరోజ తదితరులు పాల్గొన్నారు.