మక్తల్ రూరల్, జూలై 23 : రాష్ట్రస్థాయి బాల్ షూటింగ్ పోటీలకు 30 మంది క్రీడాకారులను ఎంపిక చేసినట్లు బాల్ షూటింగ్ జిల్లా అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి గోపాలం తెలిపారు. ఈనెల 24న నిర్వహించాల్సిన రాష్ట్రస్థాయి బాల్ షూటింగ్ పోటీలను వర్షాల కారణంగా వాయి దా వేసినట్లు రాష్ట్ర బాల్ షూటింగ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు, ప్రధానకార్యదర్శి ఐలయ్య ప్రకటించారని వారు తెలిపారు. తిరిగి క్రీడలను ఈనెల 31న తొర్రూర్, మహ్మదాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
రాష్ట్రస్థా యి క్రీడలకు ఎంపికైన క్రీడాకారులను పట్టణంలోని ప్రభు త్వ జూనియర్ కళాశాల మైదానంలో శనివారం ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవంలో బాల్ షూటింగ్ జిల్లా సభ్యులు మోడల్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి బాల్ షూటింగ్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులను అభినందించారు. మరిన్ని పోటీ ల్లో చక్కగా రాణించి తమ ప్రతిభను చాటుకోవాలని, భవిష్యత్తులో జాతీయస్థాయి క్రీడలకు ఎంపికై పట్టణానికి మం చి ప్రతిష్ఠలు తీసుకురావాలన్నారు. క్రీడాకారులకు అన్ని వి ధాలుగా సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఈనెల 31న తొర్రూర్, మహ్మదాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి బాల్ షూటింగ్ బాలుర విభాగంలో 15 మం ది, బాలికల విభాగంలో 15 మొత్తం 30 క్రీడాకారులను ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో నారాయణపేట జిల్లా నుంచి కల్యాణి, వై.అఖిల, హారిక, తనుజ, వైశాలి, సువర్ణ, సుష్మ, అనిత, గద్వాల్ నుంచి ఎ.అఖిల, మహబూబ్‌నగర్ నుంచి రాజేశ్వరి, సిమ్ము బేగం, బాలుర విభాగంలో నారాయణపేట జిల్లా నుంచి సంతోశ్, గణేశ్, రాము, అద్నాన్, అరవింద్, జ్యోతిశ్వర్, నీతిన్, పరశురాం, వెంకట రవితేజ, శివకుమార్, అప్రోజుద్దీన్, నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి వెం కటేశ్, రాకేశ్, గద్వాల్ జిల్లా నుంచి శ్రీధర్, అశోక్ ఎంపికైనట్లు విశ్రాంత పీఈటీ గోపాలం తెలిపారు.