ఊట్కూర్, జూలై 23 : విద్యుత్ సమస్యను నిరసిస్తూ మండలంలోని చిన్నపొర్ల గ్రామస్తులు శనివారం లింగంప ల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. పక్షం రోజుల నుంచి గ్రామంలో విద్యుత్ సమస్య తలెత్తిన విషయాన్ని ఎలక్ట్రిసిటీ అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈక్రమంలోనే శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు సర్పంచ్ రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీ రవిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్‌ను ఎదుట భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధు లు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి సెల్‌ఫోన్ నుంచి స మాచారమివ్వడంతో మక్తల్ క్యాంపు కార్యాలయం వద్దకు గ్రామస్తులను పిలిపించి సముదాయించారు. ఆతర్వాత ఎలక్ట్రిసిటీ డీఈ, ఏఈలను రప్పించి లింగంపల్లి సబ్‌స్టేషన్ నుంచి గ్రామానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని, యుద్ధప్రాతిపదికన సమస్యను పరిష్కరించాలని ఆదేశించడంతో గ్రామస్తులు శాంతించారు.
మక్తల్ రూరల్, జూలై 23 : గ్రామాల్లో ఖాళీగా ఉన్న రేష న్ డీలర్ల పోస్టులను కారుణ్య నియామకం నుంచి ప్రభు త్వం భర్తీ చేయడానికి చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాగనూర్ మండ లం వర్కూర్ గ్రామానికి చెందిన న ర్సింగమ్మను కారుణ్య నియామకం కిం ద రేషన్ డీలర్‌గా నియమిస్తూ నియామక పత్రాన్ని శనివారం ఎమ్మెల్యే అం దజేశారు. వర్కూర్లో డీలర్‌గా ఉన్న నర్సింహులు అనారోగ్యం వల్ల మృతి చెందాడు. ఆ స్థానంలో ఆయన కూతురును రేషన్ డీలర్‌గా నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏ గ్రామంలోనైనా చౌక ధర దుకాణాలకు డీలర్ల పోస్టులు ఖాళీగా ఉంటే వెంటనే భర్తీ చేయడాని కి పౌర సరఫరాల శాఖ అధికారులకు ఆదేశించామన్నారు. గ్రామాల్లో డీలర్లు వినియోగదారులకు సక్రమంగా నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని ఆయ న కోరారు. కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, మక్తల్ మండల కమిటీ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మాగనూర్ మండల క మిటీ కార్యదర్శి రాఘవేందర్‌రెడ్డి (రఘు) తదితరులు పాల్గొన్నారు.
మాగనూర్, జూలై 23 : మండలంలోని గురురావు లిం గంపల్లి సర్పంచ్ కుమ్మరి సాబ్యమ్మ మృతి చెందినట్లు స ర్పంచ్ కుమారుడు హనుమంతు తెలిపారు. కొద్ది రోజులు గా అనారోగ్యంతో బాధపడుతుండేదని అధికాస్తా విషమించడంతో శనివారం మధ్యాహ్నం మృతి చెందిందన్నారు. వి షయం తెలుసుకున్న ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి గ్రా మానికి వచ్చి సాబ్యమ్మ మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. సర్పంచ్ కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించారు. కార్యక్రమలో మహిల్రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మ్న్ వెంకట్‌రెడ్డి, తాళంకేరి గ్రామ సర్పంచ్ రామాస్వా మి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.