మహబూబ్‌నగర్ రూరల్, జూలై 23 : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ మొక్కల పెంపకాన్ని బాధ్యతగా తీసుకోవాలని ఎంపీపీ సుధాశ్రీ అన్నారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలం అప్పాయిపల్లిలో శనివారం గ్రామస్తులకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అటవీశాతం పెంచేందుకు ప్రభు త్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఇంటి ఆవరణతోపాటు ఖాళీ స్థలాలు, రోడ్ల కు ఇరువైపులా, వ్యవసాయ పొలంగట్లపై పెద్దఎత్తున మొక్కలు నాటి పెంచాలని కోరా రు. కార్యక్రమంలో సర్పంచ్ ఊశన్న, ఉపసర్పంచ్ రాంచంద్రయ్య, రాఘవేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల, జూలై 23 : మండలంలోని గం గాపూర్, అల్వాన్‌పల్లి, తంగెళ్లపల్లి గ్రామాల్లో ఎంపీడీవో ఉమాదేవి పర్యటించి హరితహారం మొక్కలను పరిశీలించారు. జడ్చర్ల నుంచి కుర్వగడ్డపల్లివరకు ప్రధానరహదారికి ఇరువైపులా మూడు వరుసలు మొక్క లు నాటడాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. అలాగే గంగాపూర్, అల్వాన్‌పల్లి గ్రామాల్లో నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందున అన్ని గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేసినట్లు తెలిపారు. 167వ జాతీయరహదారికి ఇరువైపులా మూడు వరుసల్లో మొక్కలు నాటుతున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం లోపించకుండా చూడాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.
కోయిలకొండ, జూలై 23 : మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం మండలంలో 10వేల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంపీపీ శశికళాభీంరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణయ్య తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి సూచన మేరకు చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.