మహబూబ్‌నగర్, జూలై 23: టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి కార్యాలయంలో శనివారం బీజేపీ మహబూబ్‌నగర్ పట్టణ ఉపాధ్యక్షుడు గోనెలరాజు, అతడి అనుచరులు సుమారు 500మంది మం త్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ సహకారంతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాలమూరును హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చే స్తున్నందున పార్టీలో చేరుతున్నట్లు గోనెల రాజు వెల్లడించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో మహబూబ్‌నగర్ జిల్లాను అన్నిరంగా ల్లో అభివృద్ధి చేసేందుకు నిర్విరామంగా కృషి చే స్తున్నట్లు వెల్లడించారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న పాలమూరులో కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు.
జిల్లాకు పరిశ్రమ లు, కంపెనీలు తరలి వస్తున్నాయన్నారు. గతం లో వలస వెళ్లిన వారు వాపస్ వస్తున్నారన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం, 24గంటల విద్యుత్, విద్య, వైద్యానికి మహబూబ్‌నగర్‌లో పెద్ద పీట వేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేశ్, రామకృష్ణ, పరమేశ్, గోనెల శ్రీనివాస్, నరేశ్, జీవన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.