మహబూబ్‌నగర్ టౌన్, జూలై 23 : భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తమై శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్, సీడీఎంఏ సత్యనారాయణ అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌తో మాట్లాడారు.
వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలన్నారు.అలాగే తాగునీరు కాలుష్యం కా కుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దోమల వృద్ధిని అరికట్టి మలేరియా, చికున్‌గున్యా, డెంగీ ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వీసీలో మున్సిపల్ కమిషనర్లు ప్రదీప్‌కుమార్, నూరుల్‌నజీబ్, అధికారులు ప్రతాప్‌కుమార్, సుబ్రహ్మణ్యం ఉన్నారు.