కొల్లాపూర్, జూన్ 22 : కొల్లాపూర్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ (బటన్హోల్) శిబిరాన్ని పదేళ్ల తరువాత ఎట్టకేలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రారంభించనున్నారు. పట్టణ సమీపంలోని రామాపురం శివారులో నూతనంగా అన్ని హంగులతో నిర్మించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రం లో ఉచిత బటన్ హోల్ ఆపరేషన్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని గురువారం ఉదయం 10 గంటలకు ముఖ్య అతిథులు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జిల్లా వై ద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్లాల్ ప్రారంభించనున్నారని స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్ బుధవారం తెలిపారు.
ఆపరేషన్ శిబిరానికి కొల్లాపూర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పదేళ్ల కిందట కొల్లాపూర్ పట్టణంలోని ప్రభుత్వ సివిల్ దవాఖానలో నాటి డాక్టర్ శేఖర్‌రెడ్డి బటన్హోల్ ఆపరేషన్ చేసేవారు. ఆయన తన పదవీకాలం ఉన్నంత వరకు నియోజకవర్గం నలుమూలల నుం చి కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడానికి వ చ్చే మహిళలకు ఆపరేషన్ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో డాక్టర్ శేఖర్‌రెడ్డి ఉద్యోగవిరమణతో కుటుంబ నియంత్రణ శిబిరాలకు బ్రేక్ పడినట్లయింది.
సివిల్ సర్జన్ డాక్టర్ లేకపోవడంతో బటన్ హోల్ ఆపరేషన్లు చేసే వారు లేక ఈ ప్రాంత మహిళలు నాగర్‌కర్నూల్, వనపర్తి, పాలెం తదితర ప్రాంతాలకు వెళ్తుండేవారు. దవాఖానలోని ఆపరేషన్ థియేటర్‌తో సహా వైద్య పరికరాలు సైతం పనికిరాకుండాపోయాయి. దీంతో కొల్లాపూర్ సివిల్ దవాఖానలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరగవన్న విషయం ప్రజలకు తెలిసిపోయింది.
ఎట్టకేలకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి చొరవతో రామాపురం శివారులో రూ.5.6కోట్ల వ్య యంతో యుద్ధప్రాతిపదిక పై నిర్మించిన మాతా శిశు ఆరో గ్య కేంద్రాన్ని ఈ ఏడాది జనవరి 25న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుచే ప్రారంభింపచేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకొచ్చారు. దీంతో గురువారం తొలిసారిగా ఎంసీహెచ్‌లో కుటుంబ నియంత్రణ బటన్ హోల్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.