నాగర్‌కర్నూల్, జూన్ 15: వృద్ధాప్యంలోకి ప్రతిఒక్కరూ ఏదో ఒకరోజు అడుగుపెడతారని, పెద్దలను గౌరవించే ఉమ్మడి కు టుంబ సంప్రదాయంలో పుట్టిన అందరూ తల్లిదండ్రులను వృద్ధాప్యంలో బాధ్యతగా చూడాలని కలెక్టర్ ఉదయ్‌కుమార్ హితవు పలికారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్స వం సందర్భంగా బుధవారం కలెక్టరేట్లో జి ల్లా వికలాంగులు, వయోవృద్ధుల హెల్ప్‌లైన్ గోడపత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వృద్ధాప్యం ఏఒక్కరికీ శాపం కారాదన్నారు. పిల్లల కోరికలు తీర్చడానికి తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో అనేది పిల్లలకు తెలియాలన్నారు. జీవితం చివరి రోజులు ఆనందంగా కుటుంబ సభ్యుల మధ్య గడిపేలా ప్రతిఒక్కరూ ఆలోచించి తగు విధంగా వ్యవహరిస్తే వృద్ధాప్యం ఏ ఒక్కరికీ శాపం కాదని చెప్పారు.
వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వయోవృద్ధులను కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం, మానసిక వేధింపులు, శారీరక వేధింపులు, ఆర్థిక వేధింపులు, లైంగిక వేధింపులకు గురిచేస్తే ప్రతిరోజూ ఉదయం 8నుంచి రాత్రి 8 గం టల వరకు 14567 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. వయోవృద్ధులను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో జిల్లా వికలాంగు లు, వయోవృద్ధుల సంక్షేమశాఖ అధికారి వెంకటలక్ష్మి, జిల్లా ఆడిట్ అధికారి శ్రీనివాసులు, డీపీవో కృష్ణ, సఖి జిల్లా కోఆర్డినేటర్ సునీత, డీసీపీవో నిరంజన్, వయోవృద్ధుల హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ పవన్ పాల్గొన్నారు.
నాగర్‌కర్నూల్, జూన్ 15: పోటీ పరీక్షలకోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకోసం రాష్ట్ర సామాజిక, ఆర్థిక అంశాలకు సంబంధించిన పుస్తకాన్ని బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ఉదయ్‌కుమార్ ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థులకోసం ముద్రించిందని కలెక్టర్ తెలిపారు. 300 పేజీలతో రాష్ట్ర ప్రణాళిక విభాగం ప్రచురించిన సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2022 పుస్తకాన్ని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అధ్యర్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సమగ్ర వివరాలతో మల్టీకలర్లో ఆకర్షణీయంగా ఉన్న ఈ పుస్తకాలు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయంలో లభిస్తాయన్నారు. రూ.150 చెల్లించి పుస్తకాలను తీసుకోవచ్చని తెలిపారు. వివరాలకోసం జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి భూపాల్‌రెడ్డిని 9000701301 నెంబర్లో సంప్రదించాలని సూచించారు.