నాగర్‌కర్నూల్, జూన్ 15 : ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ ఈనెల 18న జిల్లాలో కొల్లాపూర్, నాగర్‌కర్నూల్‌లో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పర్యటించనున్న నేపథ్యంలో ఎస్పీ మనోహర్, అదనపు కలెక్టర్ మోతీలాల్ బుధవారం నాగర్‌కర్నూల్ పట్టణంలో పర్యటించారు. పోలీస్ బందోబస్తు, హెలీప్యాడ్ స్థలం, కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి కేటీఆర్ జిల్లాకేంద్రంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
మంత్రి ప్రధానంగా నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ పథకాల ద్వారా మంజూరైన రూ.కోటీ 20లక్షలతో చేపట్టిన కొల్లాపూర్ చౌరస్తా సైడ్ లైటింగ్ ప్రారంభోత్సవం, రూ.17కోట్లతో చేపట్టిన ట్యాంక్‌బండ్ ప్రారంభోత్సవం, రూ.25 లక్షలతో చేపట్టిన భారీ జెండావిష్కరణ, రైతు బజార్ వద్ద యూజీడీ ప్రారంభోత్సవం చేయనున్నారు. అలాగే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, అంబేద్కర్ చౌరస్తా వద్ద సీసీ రోడ్లు ప్రారంభోత్సవం, శంకుస్థాపన, కలెక్టరేట్ వద్ద మిషన్ భగీరథ ప్రారంభోత్సవం, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, పాత మార్కెట్ యార్డు వద్ద వైకుంఠధామం, డంపింగ్‌యార్డుకు శంకుస్థాపన చేయనున్నారు.
అలాగే మున్సిపల్ ఆఫీస్ ప్రారంభోత్సవం, జడ్చర్ల నుంచి నాగర్క ర్నూల్ వయా సిర్సవాడ ఆర్అండ్బీ రోడ్డు ప్రారంభోత్సవం, మార్కండేయ ఎత్తిపోతల పథకం శంకుస్థాపన, జిల్లా గ్రంథా లయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే పాత మార్కెట్‌యార్డు వద్ద టౌన్‌హాల్ నిర్మాణ పనుల కు శంకుస్థాపన, పాత మార్కెట్ యార్డు వద్ద వెజ్‌టేబుల్ మార్కెట్ నిర్మాణ పనుల శంకుస్థాపన, ఆర్అండ్బీ గెస్ట్‌హౌజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే పలుచోట్ల రోడ్డు పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో నాగలక్ష్మి, ఆర్అండ్బీ డీఈ రమా దేవి, మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ఉన్నారు.
నాగర్‌కర్నూల్‌టౌన్, జూన్ 15 : జిల్లా కేంద్రంలో ఈ నెల 18న శనివారం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా పట్టణంలో చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నా యి. జిల్లా కేంద్రంలోని పలు అబివృద్ధి పనులకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్న సందర్భంగా అధికా రులు పనుల్లో నిమగ్నమయ్యారు. బుధవారం రోడ్లకు ఇరువైపులా మొక్కలునాటే కార్యక్రమాలతోపాటు ట్యాంక్ బండ్, మున్సిపల్ కార్యాలయాల ప్రారంభోత్సవానికి అధికా రులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అనంతరం బిజినేపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి రూ.100కోట్లతో చేపట్టనున్న మార్కండేయ లిఫ్ట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయ నున్నారు. అనంతరం బిజినేపల్లి మండలకేంద్రంలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
బిజినేపల్లి, జూన్ 15: మండలకేంద్రంలోని మండల ప్రజాపరిషత్ నూతన భవన నిర్మాణ పనులను బుధవారం ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు. ఈనెల 18న మంత్రి కేటీఆర్ ప్రారంభించనుండడంతో మిగిలిపోయిన పనులను త్వరగా చేయాలని అధికారులకు సూచించారు. ప్రారంభం నాటికి పూర్తి చేసి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఇన్చార్జి ఎంపీడీవో కృష్ణయ్య, ఎంపీవో రాములు నాయక్ ఉన్నారు.
తిమ్మాజిపేట,జూన్ 15 : ఈ నెల 18న నియోజకవర్గంలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జోగు ప్రదీప్, ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మండలకేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్యనాయకులతో బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యటన సందర్భంగా బిజినేపల్లి మండలకేంద్రంలో నిర్వహించే బహిరంగ సభకు మండలం నుంచి నాయకులు, కార్యకర్తలు, రైతులు అధికసంఖ్యలో తరలిరావాలన్నారు. ప్రతి గ్రామం నుంచి కనీసం వందమంది రావాలని కోరారు. స్థానికంగా అందరినీ తరలించే బాధ్యత సర్పంచులు, ఇతర ముఖ్యనాయకులదన్నారు. సమావేశంలో రైతుబంధు సమితి కన్వీనర్ వెంకటస్వామి, ఇతర నాయకులు పాల్గొన్నారు.