తాడూరు , జూన్ 15 : మండలంలో మంగళవారం రాత్రి 7.5సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షానికి మండలంలోని చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. మండలంలోని మేడిపూర్ యూపీఎస్ పాఠశాలలోకి వర్షపు నీరు చేరింది. ఎట్టిధర్పల్లి గ్రామంలో వ్యవసాయ భూముల్లోని నీరు ఇండ్లల్లోకి చేరుకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడినట్లు సర్పంచ్ మనోహర్ తెలిపారు.
పొలాల్లో ఉన్న మిర్చి పంట మొత్తం నీటిలో మునిగి రైతులకు నష్టం జరిగింది. దుందుభీ నది పెద్దఎత్తున ప్రవహించడంతో నది సమీప గ్రామాల రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఎట్టిధర్పల్లి గ్రామంలోని నీరు నిల్వ ఉండకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సర్పంచ్ అధికారులను కోరారు. మేడిపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేరుకున్న నీటిని ఎంపీడీవో గంగమోహన్ పరిశీలించారు.
చారకొండ, జూన్ 15 : మండలంలోని చారకొండ, తుర్కలపల్లి, తిమ్మాయిపల్లి, గోకారం, చంద్రాయన్పల్లి, జూపల్లి తదితర గ్రామాల్లో మంగళవారం అర్థరాత్రి భారీ వర్షం కురిసింది. మండలంలో పలు గ్రామాల్లో చిన్న చిన్న చెరువులు, కుంటలు నిండా యి. మండలంలోని చంద్రాయన్పల్లిలో కురిసిన వర్షం తాకిడికి చంద్రాయన్పల్లి, ఎర్రవెల్లి, గోకారం రోడ్డు పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. ఆయా గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిపిపోయాయి. అధికారులు, ప్రజాప్రతి నిధులు స్పందించి వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు.
తాడూరు, జూన్ 15 : మండలంలోని యాదిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి ఇంటి సమీపంలో పిడుగుప డడంతో గ్రామానికి చెందిన బాలచెన్నయ్యకు చెందిన ఆవు మృతి చెందినట్లు సర్పంచ్ గున్న ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. ఆవు విలువ రూ.70వేలు ఉంటుందని రైతును ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ కోరారు.