మహబూబ్‌నగర్ టౌన్: సుందర పట్టణంగా మహబూబ్‌నగర్‌ను అన్ని విధాల తీర్చిదిద్దుతామని రాష్ట్ర అబ్కారీ, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి డా.వీ.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎనుగొండ 5వ వార్డులో రూ.10లక్షల తో నిర్మించనున్న సీసీ,రూ. 76లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, వీలినగ్రామాల అభివృద్ధికి ప్రత్యే క నిధులు కేటా యించామని గుర్తు చేశారు. రోడ్డు విస్తరణ పనులు పూర్తి కావస్తున్నామని, చౌరస్తాలను సుందరంగా తీర్చిదిద్దామన్నారు. గతంలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, తెలంగాణ ఏర్పడిన తరువాత ఎమ్మెల్యే గా గెలిచిన తరువాత ప్రతి వార్డు పర్యటించి సమస్యలు గుర్తించామని తాగునీటీ సమస్యను పరిష్కరించామని తెలిపారు.
మిషన్‌భగీరథ రోజు నీటీ సరఫరా చేస్తున్నామని గుర్తు చేశారు. అన్ని వార్డులో పార్కులు అభివృద్ధి చేశామని, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని గుర్తు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేశ్, డీసీసీబీ వైస్ చైర్మన్ కోరమోని వెంకటయ్య, కౌన్సిలర్ వనజ, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రవికుమార్, శరత్చంద్ర, మోతీలాల్ పాల్గొన్నారు.