
మహబూబ్‌నగర్, జూలై 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాకముందు చాలా గ్రామాల్లో కనీస వసతులు కూ డా ఉండేవి కాదు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలకు నోచుకునే పరిస్థితి లేదు. కానీ, స్వరాష్ట్రం సా ధించాక గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. కొత్త పంచాయతీ చట్టం వచ్చాక గ్రామాలు అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. తాగునీరు దొరకక అల్లాడిన గ్రామం.. ప్రధాన రహదారి నుంచి గ్రామానికి వస్తున్న క్రమంలో సేదతీరేందుకు నీడ కు కష్టంగా ఉన్న పల్లె నేడు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎటుచూసినా పచ్చదనంతో పచ్చలహారాన్ని మెడలో వేసుకున్న చందంగా ఆకట్టుకుంటున్నది. ఆ గ్రామమే మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం దమ్మాయపల్లె. పల్లెప్రగతిలో భాగంగా అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నది. యువ పం చాయతీ కార్యదర్శి, కష్టపడి పనిచేసే సర్పంచ్, ప్రభుత్వ పథకాలను గ్రామానికి చేరువ చేసే ఎమ్మెల్యే, ఉన్నతాధికారుల చొరవతో దమ్మాయపల్లి అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది..
ఆకుపచ్చని దమ్మాయపల్లి..
చాలా గ్రామాల్లో ఒకే పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేస్తున్నా రు. కానీ, దమ్మాయపల్లెలో మాత్రం మూడు ఉన్నాయి. గ్రా మంలో రెండు, సమీపంలో ఉన్న పర్యాటక ప్రాంతం భవానీసాగర్ వద్ద పల్లె ప్రకృతివనాలు ఏర్పాటు చేశారు. వీటిని ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. ప్రజలు సేదతీరేందుకు ఉపయోగంగా మారాయి. భవానీసాగర్ వద్ద ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం మహబూబ్‌నగర్ పట్టణం నుంచే వెళ్లే వారికి కూ డా ఆహ్లాదాన్ని పంచుతున్నది.
అన్నింటా ఫస్ట్..
దమ్మాయపల్లె.. పల్లెప్రగతిలోభాగంగా ఇప్పటి వరకు చేపట్టిన అన్ని కార్యక్రమాల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. గ్రామం లో వంద శాతం పన్నులు వసూలు చేయడమే కాకుండా ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి, ఇంకుడుగుంత తప్పనిసరి చేశారు. ప్రతి విద్యుత్ స్తంభానికీ ఎల్ఈడీ లైటే కనిపిస్తుంది. నిత్యం డ్రైనేజీలు శుభ్రం చేయడం, రోడ్లు ఊడ్చడం, ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించడం క్రమం తప్పకుండా జరిగే పని. గ్రామ పంచాయతీ తరఫున ముగ్గురు మల్టీపర్పస్ వర్కర్లను నియమించారు. ప్రభు త్వం ఇచ్చిన ఉచిత ట్రాక్టర్, ట్యాంకర్ వరంగా మారింది. పచ్చదనం పెంపొందించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉందని సర్పంచ్ తెలిపారు. ట్రాక్టర్, ట్యాంకర్ ఉండడంతో మొక్కలను తీసుకొచ్చేందుకు, నాటిన మొక్కలకు నీటిని పట్టేందుకు, రోడ్లు, డ్రైనేజీలు శుభ్రం చేసిన తర్వాత చెత్త సేకరణకు, నర్సరీకి అవసరమైన మట్టి, గుంతలు పూడ్చేందుకు మట్టి తీసుకొచ్చేందుకు ట్రాక్టర్ ఉపయోగంగా మారింది. గతంలో ఇంతటి పనులు చేసేందుకు ప్రైవేట్ ట్రాక్టర్లను ఉపయోగించాల్సి వచ్చేది.
పనిచేయడం గర్వంగా ఉంది..
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి న తర్వాత పల్లెల రూపురేఖలు మారిపోయాయి. దమ్మాయిపల్లి గ్రామంలో ఎటుచూసినా పచ్చదనమే కనిపిస్తుంది. గ్రామంలో ఇంతవరకు 30 వేల మొక్కలు నాటాం. సర్వైవల్ రేటు 95 శా తంగా ఉంది. మూడు పల్లె ప్రకృ తి వనాలు ఏర్పాటు చేశాం. వందశాతం పన్నులు వ సూలు చేస్తున్నాం. ప్రతి ఇంటి వద్ద మొక్కలు నా టించాం. ఎవెన్యూ ప్లాంటేషన్ ఆకట్టుకునేలా ఏర్పాటైం ది. పాడుబడిన ఇండ్లను తొలగించాం. చెత్తాచెదారం లేకుండా చూస్తున్నాం. గ్రామాన్ని నందనవనంగా మా ర్చాం. గ్రామాభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శిగా నా వంతు పాత్ర పోషిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది.
అందరి సహకారంతో గ్రామాభివృద్ధి..
హరితహారం కార్యక్రమాన్ని నూటికి నూరు శాతం చక్కగా అ మలు చేస్తున్నాం. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తో రోడ్లపైకి మురుగు నీరు వచ్చే పరిస్థితి లేకుండా జాగ్రత్త పడుతున్నాం. ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మించాం. గ్రామస్తులు, అధికారులు, ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామాన్ని భవిష్యత్‌లో మరింత అభివృద్ధి చేస్తాం. మా గ్రామస్తుల తరఫున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
గతంలో ఒక్క చెట్టు లేకుండె..
తెలంగాణ రాకముందు మా ఊరికి సీసీ రోడ్డు లేదు. తాగునీరు వచ్చే పరిస్థితి లేదు. వైకుంఠధామం, హరితహారం, పల్లెప్రకృతివనం అనేవి ఊహించే పరిస్థితి లేదు. రోడ్డుకు ఇరువైపులా పచ్చని మొక్కలతో మా ఊరు స్వాగతం పలుకుతుంది. ఇదంతా రాష్ట్రం వచ్చిన తర్వాత చోటు చేసుకున్న మార్పే అని గర్వంగా చెప్తున్నా.