
భూత్పూర్, జూలై 5: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని తాటిపర్తి, కరివెనలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి రైతు వేదికలను ప్రారంభించి మాట్లాడారు. 2014కు ముందు రాష్ట్రంలో వ్యవసాయం వద్దనుకొని పల్లెలను వదిలి జీవనోపాధికి పట్నాలకు వలసవెళ్లారని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి చేసిన అభివృద్ధిని చూసి తిరిగొస్తున్నారన్నారు. అదేవిధంగా రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎంపీ మన్నె మాట్లాడుతూ రైతులకు ఇంతగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వానికి ప్రజల సహకారం ఉండాలని కోరారు.
అనంతరం జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ పేదరిక నిర్మూలన ప్రతిఒక్కరి బాధ్యతగా భావించాలని, రైతువేదికల నిర్మాణాలతో రైతులు గౌరవంగా చెప్పుకునేలా చేశారన్నారు. ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలనే సంకల్పంతో పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టును మంజూరు చేశారన్నారు. 2లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అనంతరం రెండు గ్రామాల్లో హరితహారంలో భాగంగా ప్రతి ఇంటికి రెండు మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం 109కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్‌నందలాల్ పవార్, డీఏవో సుచరిత, ఎంపీపీ డాక్టర్ కదిరె శేఖర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్‌గౌడ్, ఎంపీడీవో మున్ని, తాసిల్దార్ చెన్నకిష్టన్న, సింగిల్ విండో చైర్మన్ అశోక్‌రెడ్డి, రైతుబంధు మండలాధ్యక్షుడు నర్సింహాగౌడ్, వైస్ చైర్మన్ నారాయణగౌడ్, సర్పంచులు వెంకటయ్య, జహంగీర్‌బీ, ఎంపీటీసీ పుల్లయ్య, నిర్మలామాధవరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జూలై 5: అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన అల్లీపూర్లో పలు ఆభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.2కోట్ల లక్షా60వేల వ్యయంతో నిర్మించిన 40డబుల్ బెడ్రూం ఇండ్లకు మంత్రి శంకుస్థాపన చేశారు. రూ.కోటీ 45లక్షల వ్యయంతో నిర్మించిన 33/11కేవీ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. రూ.35లక్షల వ్యయంతో నిర్మించనున్న వడ్డెర కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన, రూ.25లక్షల వ్యయంతో నిర్మించిన తాగునీటి ట్యాంక్‌ను ప్రారంభించి మంత్రి మాట్లాడారు. అల్లీపూర్ రోడ్డుతోపాటు, తాగునీరు, విద్యుత్ సబ్‌స్టేషన్, మూడు చెరువులలో పూడికతీత చేపట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్‌పవర్, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్, ఎంపీపీ సుధాశ్రీ, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, ఈఈ వైద్యం భాస్కర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వెంకటరమణ, ట్రాన్స్‌కో ఎస్ఈ మూర్తి, సర్పంచ్ ఆంజనేయులు పాల్గొన్నారు.