
7 లక్షల 69 వేల వరకు మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం
ప్రతి జీపీలో 30 వేలు నాటాలని అంచనా
ఏడో విడుతకు అధికారులు సన్నద్ధం
ఈ నెల చివరి వారంలో ప్రారంభం
నారాయణపేట రూరల్ జూన్ 3 : పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం హరితహా రం కోసం కోట్ల వెచ్చిస్తున్నది. నాటేందుకు కావాల్సిన మొ క్కల కోసం నర్సరీలను ఏర్పాటు చేసింది. కార్యక్రమంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేసి పచ్చదనం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఏడో విడుత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అ ధికారులు చర్యలు చేపట్టారు. మండలంలోని 27 గ్రామ పంచాయతీల్లో వన నర్సరీలను ఏర్పాటు చేసి 7 లక్షల 69 వేల మొక్కలను సిద్ధంగా ఉంచారు. అయితే రెండేండ్లల్లో ఈ మొక్కలు నాటేందుకు సిద్ధం చేశారు. ఈ నెల చివరి వారంలో గ్రామాల వారీగా ప్రతి గ్రామంలో 10 వేల నుంచి 30 వేల వరకు మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
నర్సరీల్లో అందుబాటులో మొక్కలు
అభంగాపూర్లో 22 వేలు, అమ్మిరెడ్డిపల్లిలో 30 వేలు, అంత్వార్‌లో 10 వేలు, అప్పక్‌పల్లిలో 21 వేలు, అంత్వార్‌లో 15 వేలు, అప్పిరెడ్డిపల్లిలో 20వేలు, బండగొండలో 22 వేలు, భైరంకొండలో 20 వేలు, బోయిన్పల్లితండాలో 15 వేలు, బోయినపల్లిలో 20 వేలు, బొమ్మన్‌పాడ్‌లో 11 వేలు, చిన్నజట్రంలో 20 వేలు, ఎక్లాస్‌పూర్‌లో 20 వేలు, జాజాపూర్‌లో 20 వేలు, జిల్లాల్పూర్లో 30 వేలు, కొల్లంపల్లిలో 30 వేలు, కోటకొండలో లక్ష, లక్ష్మీపూర్‌లో 20 వేలు, లింగంపల్లిలో 15వేలు, మీదితండాలో 15 వేలు, మేకహనుమాన్తండాలో 15 వేలు, ఊటకుంటతండాలో 22 వేలు, పేరపళ్లలో 40 వేలు, పిల్లిగుండ్లతండాలో 10 వేలు, శేర్నపల్లిలో 44 వేలు, శాసన్‌పల్లిలో 41 వేలు, సిం గారంలో లక్షా, తిర్మలాపూర్‌లో 20 వేలు, వందర్గుట్టతండాలో 11 వేలు చొప్పున మొత్తం 7 లక్షల 50 వేల మొక్క లు హరితహారం కార్యక్రమంలో నాటేందుకు సిద్ధంగా ఉ న్నాయి. వీటిలో వేప, పొప్పాయి, ఉసిరి, దానిమ్మ, కాను గ, చింత, గుల్మోర్, గులాబీ, నేరేడు, జమ్మి, మారేడు, రే గు, జీడి, ఎర్ర చందనం, సీమచింత , మర్రి, రావి, వెలగ, వెదురు, మోదుగ మొక్కలు ఉన్నాయి.
బాధ్యతగా పాల్గొనాలి
త్వరలో ప్రారంభం కానున్న 7వ విడుత హరితహారం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ బాధ్యతగా పా ల్గొని విజయవంతం చేసేందుకు కృషి చేయాలి. గ్రామ పంచాయతీల వారీగా మొ క్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. రెండేండ్ల ల్లో నాటేందుకుగానూ 7.69 లక్షల మొక్కలను వివిధ నర్సరీల్లో పెంపకం చేపడుతుండగా ఈసారి 3.8 లక్షల మొక్కలు నాటేందుకు అంచనాలు సిద్ధం చేశాం. ప్రభు త్వం 7వ విడుత కోసం తేదీని నిర్దేశించగానే ప్రజాప్రతినిధులతో ప్రారంభిస్తాం. ప్రభుత్వం మండలానికి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకుంటాం.
సందీప్ కుమార్, ఎంపీడీవో నారాయణపేట