
మహబూబ్‌నగర్ టౌన్, జూన్ 2 : రాష్ట్ర అవతరణ వేడుకల ను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ పార్టీల కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో వైస్ చాన్స్‌లర్ లక్ష్మీకాంత్ రాథోడ్ జాతీయ జెండాను ఆవిష్కరించగా, రిజిస్ట్రార్ పవన్‌కుమార్, వోఎస్డీ మ ధుసూదన్రెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి నాగం కుమారస్వా మి, ప్రిన్సిపాల్ నూర్జహన్బేగం వేడుకల్లో పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయంలో సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్ జాతీయజెండా ఎగురవేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి మనోజ్‌కుమార్ పాల్గొన్నారు. పురపాలిక సంఘం కార్యాలయంలో చైర్మన్ కేసీ నర్సింహులు జాతీయజెండా ఎగుర వేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ తాటి గణేశ్, కమిషనర్ ప్రదీప్‌కుమార్, మాజీ వైస్‌చైర్మన్ రాములు, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ప్రధా న స్టేడియంలో డీవైఎస్వో శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో శంకరాచారి జాతీయ జెండాను ఆవిష్కరించగా, సూపరింటెండెంట్ శ్రీ నివాసులు, సిబ్బంది సమాద్ వేడుకల్లో పాల్గొన్నారు. జిల్లా వి ద్యాశాఖ అధికారి కార్యాలయంలో డీఈవో ఉషారాణి జాతీయజెండా ఆవిష్కరించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో బెనహర్, లక్ష్మణ్‌యాదవ్, సంజీవ్ ముదిరాజ్, జహీర్‌అక్తర్, రాములుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఆల్మదీనాలో..
ఆల్ మదీనా కళాశాలలో రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, కళాశాల కార్యదర్శి ఇంతియాజ్‌ఇసాక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సజ్జాద్అహ్మద్, ముజాఫర్అలీ, అహ్మద్, బషీర్ పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో..
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ వెంకటేశ్వర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్పీ ఆడ్మిషన్ వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, డీఎస్పీలు శ్రీధర్, కిషన్ పాల్గొన్నారు.
హన్వాడ మండలంలో..
మండలంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ బాలరాజు, రెవెన్యూ కార్యాలయంలో తాసిల్దార్ శ్రీనివాసులు, రైతు సేవా సహకార సంఘం కార్యాలయంపై డైరెక్టర్ కొండ బాలయ్య జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
నిరాడంబరంగా అవరతణ దినోత్సవం
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జడ్చర్లలో నిరాడంబరంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారు లు కేక్ కట్ చేసి స్వీట్లు పంచుతూ సంబురాలు జరుపుకొన్నారు. రెవెన్యూ కార్యాలయంలో తాసిల్దార్ లక్ష్మీనారాయణ, మున్సిప ల్ కార్యాలయంలో చైర్పర్సన్ లక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పారిశుధ్య కార్మికులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశా రు. కోర్టు ఆవరణలో జడ్జి షాలినీలింగం జాతీయ జెండాను ఎ గురవేశారు. టీఎన్జీవో సంఘం భవనం వద్ద ఆ సంఘం అ ధ్యక్షుడు తిరుపతయ్య, మార్కెట్ యార్డులో చైర్మన్ లక్ష్మయ్య, బాదేపల్లిలో గాంధీజీ విగ్రహం వద్ద కౌన్సిలర్ ఉమాశంకర్‌గౌడ్ ఆధ్వర్యంలో ఉద్యమకారులు కేకు కట్ చేసి సంబురం చేసుకున్నారు. జడ్చర్ల ప్రభుత్వ దవాఖానలో కాంగ్రెస్ నాయకులు రో గులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. వివిధ పార్టీల నాయకులు అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి ని వాళులర్పించారు. కార్యక్రమాల్లో సంగీత, నాటక అకాడమీ చై ర్మన్ శివకుమార్, సింగిల్‌విండో చైర్మన్ సుదర్శన్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్ సునీత, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మండలంలో నిరాడంబరంగా నిర్వహించారు. పంచాయతీ, ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరింఆరు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ నర్సింహులు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, తాసిల్దార్ శంకర్, ఎంపీడీవో లక్ష్మీదేవి, ఏవో నరేందర్, నాయకులు పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శశికళాభీంరెడ్డి, వివేకానంద చౌరస్తాలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీల్లో జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మల్లయ్యయాదవ్, కో ఆప్షన్ సభ్యుడు టీవీ ఖాజా, ఎంపీటీసీ ఆంజనేయులు ఎంపీడీవో జయరాం, తాసిల్దార్ ప్రకాశ్, ఏవో రామకృష్ణ, నాయకులు పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
మండలంలో రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమాల్లో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ కమల, జెడ్పీటీసీ కల్యాణి, వైస్ ఎంపీపీ వెంకటాచారి, తాసిల్దార్ రవీంద్రనాథ్, ఎస్సై వెంకటేశ్వర్లు, ఎంపీడీవో కృష్ణారావు, టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వాల్యానాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గోపాల్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు వెంకటయ్య, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గుండేడ్ చెన్నారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు మల్లేశ్, నాయకులు పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యలయం వద్ద ఎంపీపీ కాంత మ్మ, రెవెన్యూ కార్యాలయంపై తాసిల్దార్ శ్రీనివాసులు, పీఏసీసీఏస్ వద్ద చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై జయప్రసాద్, మండల మహిళా సమాఖ్యలో ఏపీఎం రాంబా బు, వ్యవసాయ కార్యాలయం దగ్గర ఏవో సిద్ధార్థ, మిడ్జిల్ గ్రా మ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ రాధికారెడ్డి జాతీ య పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శశిరేఖ, వైస్‌ఎంపీపీ తిరుపతమ్మ, ఎంపీటీసీలు సుదర్శన్, గౌస్, ఎంపీడీవో సాయిలక్ష్మి, ఉపసర్పంచ్ పద్మ పాల్గొన్నారు.
నవాబ్‌పేట మండలంలో..
మండలంతోపాటు వివిధ గ్రామాల్లో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. రెవె న్యూ కార్యాలయ ఆవరణలో ఇన్చార్జి తాసిల్దార్ నిఖితారెడ్డి, మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ అనంతయ్య, వ్యవసాయ కార్యాలయం వద్ద ఏవో కృష్ణకిశోర్, ఐకేపీ కార్యాలయం వద్ద ఏపీఎం రాంబాబు, ప్రభుత్వ దవాఖాన ఆవరణ లో డాక్టర్ నవీన్‌కుమార్‌రెడ్డి, సింగిల్‌విండో కార్యాలయ ఆవరణలో చైర్మన్ నర్సింహులు, మార్కెట్ యార్డులో చైర్మన్ డీఎన్ రావు, పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై శ్రీకాంత్, ట్రాన్స్‌కో కార్యాలయ ఆవరణలో ఏఈ కిరణ్‌కుమార్ జాతీయ పతాకం ఎగురవేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీల త, వైస్‌ఎంపీపీ సంతోశ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శీనయ్య, సర్పంచ్ గోపాల్‌గౌడ్, ఎంపీటీసీ రాధాకృష్ణ, నాయకులు పాల్గొన్నారు.
ముగ్గులు వేసి..ముస్తాబు చేసి..
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మూసాపేట ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో సిబ్బంది నీరు చల్లి వదిలేశారు. దీన్ని చూసిన ఎంపీడీవో ఉమాదేవి స్పందిస్తూ.. మన ఇంటి ముందు పండుగ చేసుకుంటే ఇలా గే పెట్టుకుంటామా అని రంగులు తెప్పించారు. ఎంపీడీవోతోపాటు ఎంపీవో సరోజ స్వయంగా ముగ్గు వేసి రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ముస్తాబు చేశారు.
దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల్లో..
దేవరకద్ర రూరల్, జూన్ 2 : దేవరకద్ర, చిన్నచింతకుంట మండల కేంద్రాలతోపాటు ఆయా గ్రామాల్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీ, పాఠశాలల్లో జాతీయ జెండాను ఎగురవేశారు.