మద్దూర్ జూన్ 6: పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెల రూపురేఖలు మరాలని ఊరూవాడా పచ్చదనాన్ని సంతరించుకోవాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నా రు. సోమవారం మండలంలోని పెదిరిపాడ్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామం లో పల్లె ప్రగతిలో చేపట్టవలసిన పనులను అధికారుల ను అడిగి తెలుసుకున్నారు. పలు వార్డుల్లో తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.్ర గామంలో మొక్కలు నాటి గ్రామంలో పచ్చదనాన్ని పెంచాలని గ్రామస్తులను కోరారు. పల్లెప్రగతిలో భాగంగా సర్పంచ్, వార్డుసభ్యులు కలిసి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేలా పనులు చేపట్టాలన్నారు. అనంతరం గ్రామంలో క్రీడా మైదానానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలోఅధికారులు, సర్పచులు, ఎంపీటీసీలు,నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
ప్రజలందరూ పాల్గొనాలి
కోస్గి, జూన్ 6: కోస్గి మున్సిపాలిటీలో కొనసాగుతున్న పట్టణ ప్రగతిలో ప్రజలందరూ పాల్గొని వార్డుల రూపురేఖలు మార్చాలని మున్సిపల్ చైర్పర్సన్ శిరీష అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 16వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సోమవారం చైర్ పర్సన్ పట్టణప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయావార్డులకు కేటాయించిన వార్డు ప్రత్యేక అధికారులు, కౌన్సిలర్లు. దగ్గరుండి పనులు చేయిస్తున్నారు.పల్లెలలో సైతం పల్లెప్రగతి మండల పరిధిలోని 26గ్రామ పంచాయత్‌లో పల్లెప్రగతి కార్యక్రమలు జోరుగా సాగుతున్నాయి.గ్రామల్లో వార్డుల వారిగా అధికారులు ,నాయకులు పనులు చేయిస్తున్నారు.