నాగర్‌కర్నూల్, జూన్ 6 : ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు పథకం దళిత కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నదని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అ న్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో సోమవారం దళితబంధు పథకం లబ్ధిదారులకు వాహనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బంగారు తె లంగాణలో దళితులందరూ ఆర్థికాభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. దళితబంధు నిధులతో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ము ఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని పేద కుటుంబాలను ఎంపిక చేసినట్లు తెలిపా రు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారి రాం లాల్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ హన్మంతురావు, జెడ్పీటీసీ చిక్కొండ్ర శ్రీశైలం పాల్గొన్నారు.