కొత్తకోట, మే 26 : సమాజంలో దళితులు తలెత్తు కొని ఉన్నతంగా జీవించా లన్నదే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం
కొత్తకోట మున్సిపాలిటీలో దళితబంధు కింద మంజూరైన భూముల డిజిటల్ సర్వే, కారు, హోంనీడ్స్ యూనిట్లను ముగ్గురు లబ్ధిదారులకు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి మంత్రి అందజేశారు. అలాగే మదనాపురం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌ను, మదనాపురం మండలం తిర్మలాపల్లి ప్రాథమిక పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితబంధు యూనిట్లతో లబ్ధిదారులు ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరారు. ‘మనఊరు -మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ బడులకు మహర్దశ పట్టనున్నదని చెప్పారు.
దళితులు ఆర్థికాభివృద్ధ్ది సాధించి సమాజంలో ఉన్నతులుగా ఎదగాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం కొత్తకోట మున్సిపాలిటీలోని దళితబంధు కింద మం జూరైన ముగ్గురు లబ్ధిదారులకు మంత్రితోపాటు ఎమ్మె ల్యే ఆలవెంకటేశ్వర్‌రెడ్డి యూనిట్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ తరతరాలుగా, సామాజికంగా ఆర్థిక వివక్షతకు గురవుతున్న దళితుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. సామాజిక, ఆర్థిక రంగాల్లో దళితుల ఆత్మగౌరవాన్ని అత్యున్నతంగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దళితబంధు పథకం ద్వారా దళితులు కొత్త కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలన్నారు.
స్వయం ఉపాధి పొందుతూ మరొకరికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అనంతరం ఎమ్మె ల్యే ఆల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దళితబంధు ప్రవేశపెట్టి వారి జీవితాల్లో నూతన ఒరవడిని తీసుకొస్తున్నారన్నారు. అనంతరం భూముల డిజిటల్ సర్వే కిరణ్‌కు, అమర్‌కు కారు, కళ్యాణకు హోంనీడ్స్ యూనిట్‌ను అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీవైస్ చైర్మన్ వామన్‌గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ సుకేశిని, డీసీసీబీ డైరెక్టర్ వంశీధర్‌రెడ్డి, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ జయమ్మ, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్, కౌన్సిలర్లు కొండారెడ్డి, ఖాజమైనుద్దీన్, తిరుపతయ్య, పద్మ, సం ధ్య, కోఆప్షన్ సభ్యులు మిషేక్, వసీం, వహీద్, నాయకులు భీమప్రసన్నలక్ష్మి, నిర్మలారెడ్డి, అయ్యన్న, రవీందర్‌రెడ్డి, బాబురెడ్డి, భీంరెడ్డి, మహేశ్, కిరణ్ ఉన్నారు.
మదనాపురం మార్కెట్‌కు పూర్వవైభవం తెస్తాం
మదనాపురం, మే 26 : పూర్వం రెండో ముంబయిగా పేరుగాంచిన మదనాపురం మార్కెట్ యార్డుకు పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల అన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌ను మార్కెట్ చైర్మన్ బాలనారాయణ గురువారం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయ గా ముఖ్య అతిథులుగా మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ మదనాపురం మార్కెట్ యార్డుకు ఆదాయ వనరులు పెంచేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ కేవలం మూడు నెలల్లోనే షాపింగ్ కాంప్లెక్స్ పనులు పూర్తి చేసినందుకు చైర్మన్ బాలనారాయణ, డైరెక్టర్లను అభినందించారు. హమాలీలు, మార్కెట్ యార్డుకు వచ్చే రైతుల విశ్రాంతి భవనం కోసం రూ.15 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అలాగే మదనాపురం గ్రామానికి చెందిన రైతు మ్యాతర్ల నాగ న్న, అజ్జకొల్లుకు చెందిన వెంకటయ్య మృతి చెందగా.. ఆయా కుటుంబాలకు మంత్రి, ఎమ్మెల్యే, వ్యవసాయ శాఖాధికారి షేక్‌మున్నా రైతుబీమా చెక్కులు అందజేశారు.
తిర్మలాయపల్లిలో ‘మన ఊరు మన బడి’ ప్రారంభం
తిర్మలాయపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని మంత్రి, ఎమ్మె ల్యే ప్రారంభించారు. అభ్యసన విధానంపై విద్యార్థులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. అలాగే శివ, సాయి, రామాలయాలను దర్శించుకున్నారు. కార్యక్రమంలో డీడీఎం పద్మహర్ష, డీఈఈ నాగేశ్వర్రావు, ఏఈ కృష్ణ య్య, డీఎం స్వరంగ్సింగ్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ వెంకట్రాములు, డైరెక్టర్లు, కార్యదర్శి భాస్కర్, సూపర్ వైజర్ చంద్రశేఖర్, ఎంపీడీవో నాగేంద్రం, జెడ్పీ వైస్‌చైర్మన్ వామన్‌గౌడ్, ఎంపీపీలు పద్మావతి, మౌనిక, స ర్పంచ్ రాంనారాయణ, జెడ్పీటీసీ కృష్ణయ్య, నాయకు లు వెంకటనారాయణ, యాదగిరి, మాసన్న, రాజ్‌కుమార్, ప్రవీణ్‌రెడ్డి, నాగన్నయాదవ్, బాలకృష్ణ, వాసురెడ్డి, అశోక్‌యాదవ్, శంకర్‌బాబు, రంగన్న ఉన్నారు.