కొల్లాపూర్, మే 12: రానున్న రోజుల్లో కొల్లాపూర్ రూపురేఖలు మారనున్నాయని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని చెప్పారు. గురువారం మండలంలోని కుడికిళ్ల గ్రామంలో జీవిత గ్రామ సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఆవరణలో రూ.2కోట్ల వ్యయంతో వెజ్,నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.142కోట్లతో సింగవట్నం-గోపల్‌దిన్నె లింక్ కెనాల్, రూ.15కోట్లతో సింగవట్న లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆధునీకరణ, కొల్లాపూర్‌లో మామిడి మార్కెటింగ్ పనులు త్వరలో చేపడుతామని స్పష్టం చేశారు.
కొల్లాపూర్ పట్టణంలో గతంలో పట్టాలు ఇచ్చి నివాస స్థలాలున్న వారందరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. పట్టణంలో బండయ్యగుట్ట, ఎస్సీకాలనీలోనూ పార్కుల ఏర్పాటుతో పట్టణం రూపురేఖలు మారుతాయన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్ని సదుపాయాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీచారి, వైస్ చైర్పర్సన్ మహిముదాబేగం, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు మతీన్అహ్మద్, కమిషనర్ రాజయ్య, మున్సిపల్ ఏఈ విద్యాసాగర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు మేకల శిరీషయాదవ్, పస్పుల కృష్ణ, కృష్ణమూర్తి, సత్యంయాదవ్, మాజీ ఉపసర్పంచ్ చంద్రశేఖరాచారి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు రుక్మద్దీన్, టీఆర్ఎస్ నాయకులు ఖాదర్‌పాషా, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు తాళ్ల పరశురాంగౌడ్, పబ్బాల్లాగౌడ్, గోపాలమల్లయ్య, బండిశ్రీను పాల్గొన్నారు.