శ్రీశైలం, మార్చి 9 : శ్రీశైల క్షేత్రంలో మహా శివరా త్రి ఉత్సవాలు అంబరాన్నంటాయి. ప్రధాన ఘట్టమై న రథోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన సుమారు రెండులక్షల మంది భక్తులతో పురవీధులు కిటకిటలాడాయి. భ్రమరాంబ, మల్లికార్జునుల కల్యాణోత్సవం అనంతరం స్వామి, అమ్మవార్లు రథంపై ఆసీనులై క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. శనివారం సాయంత్రం ఈవో పెద్దిరాజు, ధర్మకర్తల మండలి చైర్మన్ చక్రపాణిరెడ్డి ఆ ధ్వర్యంలో అశేష జనవాహిని మధ్య రథోత్సవం వైభవంగా సాగింది. ఆలయ ప్రాంగణం నుంచి భ్రామరీసమేత మల్లికార్జునుడి ఉత్సవమూర్తులను పల్లకీలో తీసుకొచ్చి సంప్రదాయం ప్రకారం రథాంగపూజ, హోమం, రథాంగబలి కార్యక్రమాలు నిర్వహించి సా త్వికబలి సమర్పించారు. అలాగే బ్రహ్మోత్సవాల్లో భా గంగా స్వామి, అమ్మవార్లకు పుష్కరిణిలో తెప్పోత్స వం నయనానందకరంగా సాగింది. ఆధునిక సాంకేతికతతో కూడిన విద్యుద్దీపాలంకరణ, సౌండ్ సిస్టమ్, వాటర్ ఫౌంటేన్ల వద్ద యాత్రికులు సెల్ఫీలు దిగారు. అక్కమహాదేవి అలంకార మండపంలో ప్రత్యేక పూజలందుకున్న స్వామి, అమ్మవార్లను ఆలయ పుష్కరిణి వద్దకు తోడ్కొని రాగా పుష్పాలంకరణ చేసిన తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
మల్లన్న సన్నిధిలో సుప్రీంకోర్టు జడ్జి
భ్రమరాంబ, మల్లికార్జునస్వామివార్లను సుప్రీంకో ర్టు జడ్జి జస్టిస్ సందీప్ మెహతా దంపతులు శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఈవో పెద్దిరాజు, చైర్మన్ చక్రపాణిరెడ్డి, వేదపండితులు స్వాగతం పలికారు. స్వామివారి గర్భాలయంలో అభిషేకం, బిల్వార్చన, అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేసి హారతులు అందుకున్నారు. అనంతరం ప్రాకార మండపంలో వేదాశీర్వచనాలు వల్లించిన ప్రధానార్చకులు అభిషేక జల తీర్థప్రసాదాలను అందజేశారు.