శ్రీశైలం, మార్చి 4 : శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నా యి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో సోమవారం శ్రీగిరి క్షేత్రం కిక్కిరిసింది. భక్తుల రద్దీ దృష్ట్యా మూడుగంటల సమయం పడుతున్నది. అలంకార దర్శనానికి ఇబ్బందులు లేకుం డా ఏర్పాట్లు చేసినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. ఆన్లైన్లో టికెట్లు పొందిన, కాలినడకన శ్రీశైలానికి వస్తున్న యాత్రికులతోపాటు శివమాలధారులకు ప్ర త్యేక క్యూల ద్వారా దర్శనం కల్పిస్తున్నారు. క్యూలో భక్తులకు తాగునీరు, మజ్జిగ అందిస్తూ ఉదయం 10 గంటల నుంచి అన్నదాన మహాప్రసాదాన్ని అం దుబాటులో ఉంచారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా భ్రమరాంబ, మల్లికార్జునస్వామివార్లు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
నాలుగో రో జు స్వామి, అమ్మవార్లకు పూజలు శాస్ర్తోక్తంగా జరిపించారు. ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, రుద్రపారాయణం, రుద్రహో మం, చంఢీహోమం, సాయంత్రం ప్రత్యేక పూజల అనంతరం స్వామి, అమ్మవార్లను మయూర వాహనంపై ఊరేగించారు. కాగా, భ్రమరాంబ, మల్లికార్జున స్వామికి టీటీడీ తరఫున పట్టువస్ర్తాలు సమర్పించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఆలయ కమిటీ చైర్మన్ చక్రపాణిరెడ్డి, ఈవో పెద్దిరాజు స్వాగతం పలికారు. గ్రామోత్సవంలో ఈఈ రామకృష్ణ, పీఆర్వో శ్రీనివాసరావు, ఏఈవోలు, శ్రీశైల ప్రభ సంపాదకు లు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.